బుల్లి పిట్ట: రూ.18 వేలకు పైగా డిస్కౌంట్ తో ఐఫోన్.. పొందడం ఎలా అంటే..?

Divya
ఐఫోన్ కొనడం అనేది ప్రతి ఒక్కరి కోరిక కానీ బడ్జెట్ పరంగా అంత డబ్బు పెట్ట లేక చాలా మంది తక్కువ ధరకే వచ్చే స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే ఐ ఫోన్ కొనాలి అని ఆలోచిస్తున్నారో..? అలాంటి వారికి భారీ డిస్కౌంట్ పైన ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. అది కూడా ఏకంగా 18 వేలకు పైగా డిస్కౌంట్ పొందే అవకాశం కూడా లభిస్తుంది.. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ను అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే ఈ ఆఫర్ ని ఎలా పొందాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ ధరకే ఐఫోన్ 13 మినీ మోడల్ ను బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ తో కలిపి కేవలం అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.. యాపిల్ స్మార్ట్ ఫోన్ పై ఊహించని రేంజ్ లో భారీ డిస్కౌంట్ లభించడం గమనార్హం. ముఖ్యంగా ఎవరైతే ఫ్లిప్కార్ట్ లో ఈ ఐఫోన్ 13 మినీ స్మార్ట్ ఫోన్ ను సిటీ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తారో వారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసినట్లయితే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది.

ఎక్స్చేంజ్ ద్వారా ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తే వారికి అదనంగా రూ.15,850 వరకు లభిస్తుంది.. ప్రస్తుతం ఈ ఐఫోన్ 13 మినీ స్మార్ట్ ఫోన్ 128 GB, 256 GB , 512 GB స్టోరేజ్ వేరియంట్ లతో మనకు లభిస్తుంది. ఐఫోన్ 13 మినీ 128 GB ధర రూ.66,900, 256 GB రూ.76,900 , 512 GB రూ.96,900 గా పలుకుతున్నాయి అయితే ఇక ఈ అన్ని మోడల్స్ పై ఆఫర్లతో కలిపి అదనంగా 16 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: