బుల్లి పిట్ట: రూ.20 వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

Divya
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో మొబైల్స్ అతి తక్కువ ధరకే దొరుకుతున్నాయి. అయితే కనీసం 20 వేల రూపాయలు లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ మొబైల్స్ కొన్ని ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1).REDMI NOTE-11T
ఈ స్మార్ట్ మొబైల్ ధర 16,999 రూపాయలు . ఇది5 జి మొబైల్. ఇక  డిస్ప్లే విషయానికి వస్తే.6.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలదు. ఈ ఫోన్ చాలా వేగంగా వీడియో టేకింగ్, గేమింగ్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇందులో 8gb ram-128 gb మెమొరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ బ్యాక్ కెమెరా 50 mp A1 క్వాడ్ కెమెరా ను కలిగి ఉంటుంది.సెల్ఫీ ప్రియుల కోసం 16 mp ఫ్రంట్ కెమెరా కలదు. బ్యాటరీ 5,000MAH కలదు.
2).REALME 8 PRO:
ఈ మొబైల్ ధర..19,990 రూపాయలు.. డిస్ప్లే విషయానికొస్తే 6.44 అంగుళాలు కలదు.ఇక పిక్చర్ క్వాలిటీ విషయానికొస్తే..2400X1080 గా ఉండనుంది. ఈ మొబైల్ 8GB ర్యామ్ +128 GB స్టోరేజ్ లో కలదు. బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే..108 mp మెగా ఫిక్సల్ కలదు. ఫ్రంట్ కెమెరా 16 mp గా ఉండనుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4,500 MAH కలదు.
3).POCO X3 PRO:
ఈ స్మార్ట్ ఫోన్ మొబైల్ ధర 18,999 రూపాయలు.. డిస్ప్లే విషయానికొస్తే 6.67 అంగుళాల డిస్ ప్లే తో FHD డిస్ప్లే కలదు. ఇక ఈ మొబైల్ 8-జిబి రామ్,128 GB మెమొరీ సామర్థ్యం కలదు. బ్యాక్ సైడ్ కెమెరా 48 mp, సెల్ఫీల కోసం 20 మెగా పిక్సెల్ కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 5,160 MAH సామర్థ్యం కలదు.
4).samsung galaxy M32-5g
ఈ మొబైల్ ధర 20,000 రూపాయలు. డిస్ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాలు కలదు. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా పనిచేస్తుంది. 5g నెట్వర్క్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక 48 మెగా పిక్సెల్ తో బ్యాక్ కెమెరా..13 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mah సామర్థ్యం కలదు. అయితే ఇందులో ఈ మొబైల్ 3 వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ బట్టి మొబైల్ ధర మారుతూ ఉంటుంది.
ఇక ఇవే కాకుండా మరికొన్ని మొబైల్స్ కూడా ఉన్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: