ఏపీ: కదిరిలో భారీ పేలుడు.. అక్కడికక్కడే నలుగురు మృతి..!
ఆ ఇళ్ల శిధిలాల కింద కూడా మరి కొంతమంది చిక్కుకున్నారేమో అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిందా లేకపోతే జిలేటిన్ స్టిక్స్ పేలిందా అనే విషయం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఆ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక అధికారులు సైతం ఈ పేలుడుకు గల కారణాల విషయం పైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ ప్రమాదంలో కొంతమంది పరిస్థితి విషయం గానే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ఇందులో 12 మంది పరిస్థితి విషయంగానే ఉందని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనను మృతి చెందిన వారిలో మహబూబున్నీ(40), సంపత్ (30), వెంకన్న (45), మధు (36) గా గుర్తించారు. ఈ పేలుడు పైన సమాచారం అందుకున్న జిల్లా అధికారులు కూడా అక్కడ పరిస్థితిని సమిక్షిస్తున్నారు. మరి ఈ పేలుడుకు గల కారణాలను పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం మృతుల సంఖ్య గంటకు పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఈ ప్రమాదం పైన ఏపీ ప్రభుత్వం ఏదైనా నష్టపరిహారం ప్రకటిస్తుందేమో చూడాలి మరి.