మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పెద్ది సినిమా వాయిదా..?

Divya
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ , డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. ఇప్పుడు తాజాగా చిత్ర బృందం విడుదల తేదీ పైన మరో కీలకమైన ప్రకటన చేసింది.


దాదాపుగా పెద్ది సినిమా షూటింగ్ పూర్తి కావోచ్చిందని కొంతమేరకు షూటింగ్ మిగిలి ఉన్నందువలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం అధికారికంగా తెలుపుతూ ఈ సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందని, కేవలం ఒకే ఒక్క సాంగ్ మిగిలి ఉంది. వీటిని కూడా త్వరలోనే పూర్తిచేసే పనిలో ఉన్నాము.. ఇప్పటికే ఎడిటింగ్ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి, సినిమా అవుట్ పుట్ చూసిన మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.


అయితే ప్రేక్షకులు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించాలని ఉద్దేశంతోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కోసం మరింత సమయాన్ని కేటాయించామంటూ టీమ్ అధికారికంగా ప్రకటించింది. టెక్నీషియన్లు తమ పనితనాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ సినిమా పర్ఫెక్ట్ గా తీసుకురావాలని ఉద్దేశంతోనే మేకర్స్ పనిచేస్తున్నట్లుగా తెలియజేశారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఏప్రిల్ 30న విడుదల చేయాలనుకున్న కానీ ఇప్పుడు అంతకంటే ఆలస్యంగా అంటే జూన్ నెలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. అయితే త్వరలోనే ఖచ్చితమైన  విడుదల తేదీని తెలియజేస్తామని ఒక నోట్ ద్వారా తెలియజేశారు. మీ ఓపికకు తగిన ఫలితం దక్కేలా ఈ సినిమా ఉంటుందని పెద్ది టీమ్ అభిమానులను ఉద్దేశిస్తూ తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ట్వీట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: