ఈ కంప్యూటర్ మనసులో ఉన్నది చెప్పేస్తుందటా..!

MOHAN BABU
మనుషుల్ని సూపర్ హ్యూమన్ లుగా మార్చే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. స్పేస్ ఎక్స్ అధిపతి ఎన్నో కొత్త ఆవిష్కరణలను, అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తున్న వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ ను చొప్పించేందుకు 2017 లో న్యూరా లింక్ అనే స్టార్టప్ ఏర్పాటు చేశారు ఎలన్ మస్క్. ఈ సంస్థ ఇప్పుడు క్లినికల్ డైరెక్టర్ నియమించేందుకు కసరత్తు చేస్తోంది. దీన్నిబట్టి బీసీఐ పరిజ్ఞానం మానవులపై ప్రయోగించే దశకు చేరువైనట్టు స్పష్టమవుతోంది. 2022 ముగిసే లోపల దాన్ని సాధిస్తామని గత నెలలో  మస్క్ ప్రకటించారు.

అంటే ఇప్పటిదాకా జంతువులపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక మనుషులపై క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ న్యురాలింక్ తయారుచేసే చిప్ దేనికోసం అనుకుంటున్నారా..? ఏం లేదు మనసులో ఏదైనా అనుకుంటే చాలు అది జరిగిపోతుంది. అయితే దానికంటూ ఓ వ్యవస్థ ఉన్నచోట అలా పనులు జరిగిపోతాయి. ఎక్కడో ఉన్న డ్రైవర్ అవసరం లేని కారు మనం ఉన్న చోటును గుర్తించి అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించి ముందుకొచ్చి ఆగుతుంది. మనకు ఇష్టమైన సంగీతాన్ని  చెవుల్లోకి కాకుండా నేరుగా మెదడులోకి చొప్పించేస్తుంది. కంప్యూటర్ డేటా తరహాలో మన జ్ఞాపకాలను డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకునే అవకాశం కలిగిస్తుంది. అవసరమైనప్పుడు వాటిని రీప్లే చేసుకోవచ్చు. అంతే కాదు వాటిని నేరుగా వాట్సాప్ మెసేజ్ పంపిన అంత తేలిగ్గా మరో వ్యక్తులకి బ్లూ టూత్ ఇలాంటి మధ్యామంతో పంపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధునాతన బ్రేన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఆయన సంస్థ చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డ వారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సహాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా దీని వల్ల మానవాతీత శక్తి లభిస్తుందన్నారు. ఆయన ప్రణాళికలో సగం అమలైన మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాణానికి విప్లవానికి తెర లేస్తుంది. అది ప్రపంచం తీరు తెన్నుల్నే మార్చేస్తుంది. మన మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల ద్వారా సంకేతాలను పంపడం, అందుకోవడం చేస్తుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై ఒక నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తాయి. న్యూరోట్రాన్స్మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేషన్ సాగిస్తాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. మెదడులోని పలు న్యూరాన్ల కు సమీపంలో ఎలక్ట్రోడ్ లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలనురికార్డు చేయడం న్యూరా లింక్ ప్రాజెక్టు ఉద్దేశం. తద్వారా వాటిని ఆధునిక యంత్రాల నియంత్రణకు ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది. సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచనాశక్తి సాయంతో  మనం యంత్రాలతో అనుసంధానం కావచ్చు. అలాగే నాడీకణాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు. 2020 జూలైలో న్యూరా లింక్ బ్రేక్ ప్రూ పరిజ్ఞానంగా ఎఫ్డిఎ నుంచి గుర్తింపు వచ్చింది.

ఇది న్యూరాలింక్  సాధనాలు భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి దారులు తెరుచుకుంటాయి. మెదడు పనితీరుపై శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు. దీని వల్ల ఈ ప్రాజెక్టుకు సవాళ్లు ఎదురుకావచ్చు. న్యూరా లింక్ తో రికార్డ్ చేసే డేటాను దుర్వినియోగం చేయొచ్చన్న  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవతలి వ్యక్తి ఆలోచన చర్యలు భావోద్వేగాలను పర్యవేక్షించడం నైతికంగా సబబేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ సాధనం అమర్చుకున్న వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకోవాలా అన్న డైలమా పరిస్థితి తలెత్తవచ్చు.దీనిపై ప్రత్యేక చట్టాలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: