బుల్లి పిట్ట:మనం మొబైల్ తో చేసే తప్పులు ఇవే..ఇకనైనా మానండి..!!

Divya
ఇప్పుడు ప్రతి ఒక్కరం ఎక్కువగా తక్కువ ధరలకే మొబైల్.. వినియోగాన్ని పొందుతూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఎటువంటి సమాచారం తెలియాలి అన్నా కూడా ఎక్కువగా మొబైల్ ని ఉపయోగించుకుంటూ ఉన్నాము. అయితే అలాంటి స్మార్ట్ ఫోన్ ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అయితే కొన్ని సార్లు మన చేతులారా మన స్మార్ట్ మొబైల్ ని పాడు చేస్తూ ఉంటాము.. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1).మనం వాడే స్మార్ట్ ఫోన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు జరుగుతూ ఉంటాయి.అయితే మనం చేసే పనులలో.. మన మొబైల్ ని ఛాతి జేబులో  పెట్టుకుంటూ ఉంటాము.. ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని మన మొబైల్ ని ఛాతి జేబులో ఉంచుకోకూడదు.
2). మొబైల్ కు ఓవర్లోడ్ ఛార్జింగ్ చేయడం వల్ల మన స్మార్ట్ మొబైల్.. వేడెక్కి పేలుడు వంటివీ సంభవించవచ్చు.అందుచేతనే 90% పైన చార్జింగ్ చేస్తే ఆఫ్ చేయడం మంచిది.
3). మొబైల్ ఛార్జింగ్ చేసేటప్పుడు సాంగ్స్ వంటివి ఇయర్ ఫోన్స్ తో వినకూడదు. అలా వినేటప్పుడు ఇయిర్ ఫోన్స్ గుండా విద్యుత్ ప్రవాహానికి దారితీస్తుందని, తాజా నివేదికలో తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం లో ఎక్కువగా ఇలాంటి సంఘటనల కారణంగా మరణించారు చాలా మంది.
4). మనం నిద్రించేటప్పుడు.. స్మార్ట్ ఫోన్ ని తలకింద, దిండు కింద పెట్టుకొని పడుకోకూడదు. అలా పెట్టుకొని పడుకున్నట్లు అయితే మన మెదడులో జరిగే టువంటి కొన్ని ఆటంకాలకు భంగం కలిగిస్తాయి. అంతేకాకుండా నిద్రకు భంగం కూడా కలిగే ప్రభావితం చూపుతుంది.
5). మొబైల్ ఫోన్ ని ఎక్కువగా ఎండకి ఉపయోగించకూడదు.. సాధారణంగా 0 నుండి45° సెంటిగ్రేడ్ లోపల ఉంటేనే మొబైల్ ని ఉపయోగించాలి. అంతేకాకుండా సమాన ఉపరితలంపై మొబైల్ ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా అసమాన ఉపరితలాలపై మొబైల్ ఛార్జింగ్ పెట్టినట్లయితే మంటలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: