బజాజ్ కొత్త ఇవి స్కూటర్ ప్లాంట్.. ఎక్కడంటే..!

MOHAN BABU
ప్రస్తుతం మారుతున్న కాలనికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు. వారి అలవాట్లు మారుతున్నాయి. అలాగే వాహనాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఒక స్కూటర్ అనేది ఎవరికో ఒక ధనవంతునికి మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక చిన్న వాహనమైన ఉంటుంది. అయితే ఈ మాడిఫికేషన్ లో భాగంగా పెట్రోల్, డీజిల్ రేటు పెరగడం, ఈ వాహనాల ద్వారా కాలుష్యం పెరగడంతో అన్ని కంపెనీలు ఎలక్ట్రికల్ వాహనాలను మన ముందుకు తీసుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల సేలింగ్ పెరుగుతోంది.  ఎలక్ట్రిక్ వెహికల్స్ ను తయారు చేయడానికి పుణేలోని ఆకుర్డి దగ్గర ఓ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను పెడదామని బజాజ్ ఆటో ప్రకటించింది.

ఈ ప్లాంట్ కోసం రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. బజాజ్ చేతక్ పాత ప్లాంట్ ఆకుర్డి దగ్గరే ఉండడం విశేషం. ఇప్పటికే ఈ ప్లాంటు ఏర్పాటు పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి ఐదు లక్షల ఈవీలని కంపెనీ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది. ఈవీలను లోకల్ మార్కెట్ లో అమ్మడానికి, విదేశాలకి ఎక్స్ పోర్ట్ చేయడానికి ఈ ప్లాంట్ సాయపడుతుందని వివరించింది. ఈ ప్లాంటులో తయారైన మొదటి వెహికల్ వచ్చే ఏడాది జూన్ లో అందుబాటులోకి తెస్తామని బజాజ్ ఆటో పేర్కొంది. ఈ ప్లాంట్ వలన మొత్తం ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు వస్తాయి. పల్సర్ తో 2001లో బజాజ్ 2.0 స్టార్టయ్యింది.

 కొత్తగా ఛార్మింగ్ చేతక్ తో బజాజ్ 3.0 వస్తోంది అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ అన్నారు. ఈవీల కోసం తమ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో పని చేస్తున్నాయని అన్నారు. సస్టయినబుల్ అర్బన్ మొబిలిటీకి తేలికపాటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అవసరమనే తన నమ్మకానికి ఈ ప్లాంటు నిదర్శనం అని రాహుల్ చెప్పారు. బజాజ్ పెట్టే ఇన్వెస్ట్ మెంట్ అమౌంట్ వివిధ వెండర్ల నుంచి సమీకరిస్తారు. ఈ వెండర్లు రూ.250 కోట్ల(33 మిలియన్ డాలర్ల ) వరకు ఇన్వెస్ట్ చేస్తారని అంచనా.ఆకుర్డి ప్లాంట్ బజాజ్ ఆటో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ కు దగ్గర్లో ఏర్పాటవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: