అంతరిక్షంలోకి అతిపెద్ద టెలిస్కోప్.. ఖగోళ రహస్యాలు..!

MOHAN BABU
విశ్వ ఆవిర్భావం తొలినాళ్లలో చూడడానికి తోడ్పడే అంతరిక్ష చక్షువు ఆవిష్కృతం కానుంది. అసలు సాధ్యమే కాదన్న అనుమానాలను దాటుకొని టైం మిషన్ తరహాలో ఖగోల రహస్యాలను ఛేదించడానికి మహావిశ్వ దర్శిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరో రెండు రోజుల్లో నింగికెగరనుంది. మూడు దశాబ్దాల,సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడనుంది. అది 1995 ప్రస్తుతం అత్యంత ఆసక్తి కలిగిస్తున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆలోచనకు బీజం పడిన సంవత్సరం. ఖగోళ అన్వేషణకు సరికొత్త  చరిత్ర సృష్టించిన హబుల్ టెలిస్కోప్ పంపించిన ఓ దృశ్యం తోనే దీని కథ ఆరంభమైంది. ఒకరకంగా దీన్ని గత కాల ప్రయాణాన్ని సూసాధ్యం చేసే టైం మిషన్ అని అనుకోవచ్చు.

కాంతి అత్యంత వేగంగా ప్రసరిస్తూ ఉంటుంది. కానీ అది విశ్వం గుండా ప్రయాణిస్తూ మనకు చేరడానికి చాలా కాలమే పడుతుంది. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్ర కాంతి ఈనాటిది కాదన్న మాట, కాబట్టే సుదూర ఖగోళ వస్తువులను నుంచి వెలువడే కాంతి పురాతన మైందని భావిస్తుంటారు. ఖగోళ రహస్యాలను ఇంకాస్త లోతుగా శోధించాలనే  ఆసక్తి పెరిగింది. అయితే ఇందుకు హబుల్ టెలిస్కోప్ దృశ్యాల స్పష్టత సరిపోదు. దీంతో కొందరు శాస్త్రవేత్తలు నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్ తయారీకి నడుం బిగించారు. అదే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గా మారింది. 13050 కోట్ల సంవత్సరాల వెనక్కి చూడగలదు. విశ్వం తొలినాళ్ళలో చీకటి నుంచి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు పుట్టుకొస్తున్న తీరును  కళ్లకు కట్టగలదు. వందకోట్ల ఏళ్లుగా నక్షత్ర మండలాలు ఎలా కలుస్తున్నాయనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడగలదు.

వెబ్ టెలిస్కోప్ 2007లోనే ప్రయోగించాలని అనుకున్నా ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూనే వచ్చింది. అసలు ఇలాంటి టెలిస్కోప్ ప్రయోగం సాధ్యమే కాదని చాలామంది అనుమానించారు.అత్యంత సంక్లిష్టమైన వినూత్న డిజైన్ తో కూడిన దీన్ని పూర్తి చేయడానికి సుమారు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయల డాలర్లు ఖర్చయ్యాయి. 400 ఏళ్లలో కనుగొనే విషయాలను ఒక దశాబ్దంలోనే గుర్తించవచ్చని  శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: