సామజిక మాధ్యమాలలో.. పరుగులెందుకో.. !

సాంకేతికత పెరిగిన తరువాత సమాచారం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆ వేగంలో దాని నాణ్యత కూడా లోపిస్తుండటం సర్వసాధారణంగా జరిగిపోతుంది. అలాగే ఎప్పుడు చూసినా ఈ సామజిక మాధ్యమాలలో తలలు పెట్టేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇవన్నీ వచ్చిన తరువాత మనిషి మనిషితో ఈ సామజిక మాద్యమాలతోనే మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రత్యక్షంగా మాట్లాడటం ఆపేశారు. అందుకే ఎప్పుడు అందులో తలపెట్టేసి, ఏమి చేసినా అందులో దానిని సమాచారంగా అందుబాటులోకి తెచ్చేసి, దానిని ఎందరు ఇష్టపడ్డారు, ఎందరు అయిష్టపడ్డారు, ఎందరు దానిపై వాచికంగా స్పందించారు లాంటివి చూసుకోవడమే ముఖ్యమైన పనిగా అయిపోయింది నేడు.
ఇది వార్తను చేరవలసిన చోటుకు త్వరితగతిన చేర్చడానికి ఉపకరిస్తే మంచిదే, కానీ అలా కాకుండా ప్రయోజనం మార్చేసుకుంటూ వ్యతిరేకంగా దానిని వాడేస్తే దుష్ఫలితాలు వచ్చేస్తున్నాయి. దీనికి కూడా చివరికి కొందరు బానిసలైపోతున్నారు. తమకు ఎక్కువ లైకులు రాలేదని బాధపడేవాళ్లు కూడా ఈ సమాజంలో ఎక్కువ అవుతున్నారు. వారందరిని మళ్ళీ కౌన్సెలింగ్ సెంటర్ లకు తీసుకెళ్లి సరిచేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా పెద్దలు, ఉన్నత వర్గాలలో ఉన్నవారు, బాగా ప్రాచుర్యం ఉన్నవారు ఈ సామజిక మాధ్యమాలు వాడటం వలన వస్తుంది.  అలాంటి వారు ఈ మాధ్యమాలను కేవలం ఆయా సమాచారాన్ని తమ అభిమానులతో పంచుకోవడానికే, అది కూడా ఒకటో రెండో సార్లు వాడతారు. దీనిని చూసి మిగిలిన వాళ్ళు అదే పనిగా వాటిని వాడి, బానిసగా మారిపోతున్నారు.
అనేక ఉన్నత వర్గాలు, సెలెబ్రిటీలు ఇలాంటి సామజిక మాధ్యమాలు వాడుతున్నారు అంటే వాళ్ళ అభిమానులకు దగ్గరవ్వడానికి, అంతే కానీ సాదరంగా వాళ్ళేమి అవి వాడరు, అంత సమయం కూడా వాళ్లకు ఉండదు. అది తెలియని ఇతరులు వాళ్ళతో పోటీపడుతూ లైక్ లు రాలేదని బాధపడేవాళ్లు ఇటీవల ఎక్కువ మంది తయారవుతున్నారు. ఇక ఆయా సామజిక మాధ్యమాల సంస్థలు కూడా కేవలం వాటి ప్రచారం కోసమే, ఆయా సెలెబ్రిటీల ఖాతాలకు భారీగా వీక్షకులు ఉన్నారంటూ చెప్పుకుంటున్నారు. అవన్నీ కూడా ప్రచారంలో భాగం అని సామాన్యులు తెలుసుకోవాలి. అప్పుడే ఈ పిచ్చి వదులుతుంది. మిగిలిన లోకంపై కూడా సమయం కేటాయిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: