నిద్రపోయేందుకే.. బస్సు..!

కడుపు లో ఆకలి రగిలిపోతున్నప్పుడే ఆలోచనలు వస్తాయని, కరువు ప్రాంతంలోనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, బ్రతుకు భయం లో నుండే నూతన ఆలోచనలు పుట్టుకొస్తాయని పెద్దలు అన్నట్టుగానే జరుగుతుంది. కొత్త ఆవిష్కరణలు ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ కాకుండా ఎక్కడ పోటీతత్వం లేదా తనకంటూ ఒక ప్రత్యేకత లేకపోతే బ్రతకడం సాధ్యం కాదో అక్కడే బయటపడుతున్నాయి. ఒక కొత్త ఆవిష్కరణ అంటే రైతు నాటిన విత్తు భూమిని చీల్చుకు ని మొక్కగా బ్రతికినంత కష్టమే. ఇవన్నీ పెద్దలు చెప్పినవే, సమయం ప్రతి సందర్భంలోను అవి సరైనవనే నిరూపిస్తుంది. లోకంలో ప్రతిరోజూ ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు ఇవన్నీ ఊతమిస్తున్నాయి. ఇవన్నీ మనిషి చేసే పనులను సులభతరం చేస్తున్నాయి తప్ప వారిపై పెరిగిపోతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించడం లేదు. దానికోసం కూడా ఎన్నో ప్రయోగాలు, శాస్త్ర విద్యలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయోజనం ఆశించినంతగా ఉండటం లేదు.
ఒత్తిడితో ఇంటికి వెళితే అక్కడ కూడా కుటుంబ సమస్యలు మరింతగా ఒత్తిడిని పెంచుతున్నాయి తప్ప మనిషి సాధారణ స్థితిని పొందలేకపోతున్నారు. కనీసం రోజు సరైన నిద్ర కూడా లేక బాధపడుతున్న వారు పెరిగిపోతున్నారు. దీనితో ఈ స్థితి నుండి వారిని బయటపడేయడానికి ఔషదాలతో వైద్యులు సరిపెడుతున్నారు. అవి కూడా కొంతకాలం తప్ప ఎక్కువ కాలం ప్రభావం చూపడంలేదు. ఇవన్నీ తెలిసినట్టుగానే ఉన్నాయేమో.. చైనా వాళ్ళు కొత్త పద్దతి కనిపెట్టారు. నిద్ర లేనివారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎవరికైన సరిగ్గా నిద్ర పట్టని పక్షంలో ఈ బస్సు ఎక్కి పడుకుంటే సరిపోతుంది.
సాధారణ బస్సు మాదిరే టికెట్ కొనుక్కోవడం, దిండు, దుప్పట తెచ్చుకోవడం, బయట శబ్దాలు వినపడకుండా చెవిలో ఆయా వస్తువులు పెట్టుకోవడం, కళ్ళకు కాంతి తగలకుండా ఆయా ఏర్పాట్లు చేసుకోవడం, ఇంకేముంది చక్కగా నిద్రలోకి జారుకోవడమే. ఆ బస్సు వాళ్ళను ఎక్కించుకొని ఆరేడు గంటలు ఇష్టానికి అటుఇటు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు సమయం అయిపోతుందో అప్పటికి ఎక్కించుకున్న చోట దింపేస్తుంది. అక్కడ ఎక్కిన వాళ్ళు నిద్రలేవడం, మళ్ళీ బస్సు దిగి తమ యదా జీవితం ప్రారంభించడం. ఇదే నిద్ర బస్సు ఐడియా. బస్సు మాములు స్లీపర్ బస్సు మాదిరే, రెండు అంతస్తులు ఉంటుంది. బాగా డిమాండ్ కూడా ఉంది, ఇలా ఆగగానే అలా నిండిపోతుందట, అంత ఒత్తిడిలో ఉన్నారన్నమాట చైనీయులు. ఉంటారు అంతటి ఘనుడు నాయకుడు అయినప్పుడు ఆ మాత్రం ఒత్తిడి ఉంటుంది. అసలే 12 గంటల పని మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: