మీ ఫోన్ స్లో అవుతోందా.. అయితే ఇది గమనించండి?

praveen
ఇటీవలి కాలంలో మొబైల్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు మనిషి అవసరాల కోసం మొబైల్ తయారు చేసారు. కానీ ఇప్పుడు మాత్రం అవసరానికి మించి మొబైల్ వాడేస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. అయితే మనిషి అవసరాల కోసం తయారు చేసిన మొబైల్ ఇక ఇప్పుడు ఏకంగా మనిషిని శాసించే స్థాయికి చేరింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం మొబైల్ అరచేతిలో లేకుండా అరక్షణం కూడా ఉండలేక పోతున్నారు కొందరు. మొబైల్ చేతిలో లేదు అంటే ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అయ్యే వారు ఎందరో. నేటి రోజుల్లో అందరూ మొబైల్ కి బానిసలుగా మారిపోయారు.

 ఒకప్పుడు మొబైల్ కి దూరంగా స్నేహితులకు దగ్గరగా ఉండేవారు..  కానీ నేటి రోజుల్లో మాత్రం ఇక స్నేహితులు ఫ్యామిలీ అన్ని కూడా మొబైలే అయిపోయింది. అయితే నేటి రోజుల్లో మొబైల్ వినియోగం పెరిగిపోవడం.. అదే సమయంలో  అటు మొబైల్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నోరకాల కొత్త యాప్స్ వస్తూ ఉండటంతో  గంటల తరబడి మొబైల్లోనే కాలం గడుపుతున్నారు.  సాధారణంగా మొబైల్ వాడుతున్న సమయంలో కొన్నాళ్ల తర్వాత మొబైల్ పర్ఫామెన్స్ లో స్లో అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది.   ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక ఎంతో మంది మొబైల్ వినియోగదారులు తలలు పట్టుకుంటారు.

 చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే చాలు మొబైల్ స్లో అయినప్పటికీ మళ్లీ పర్ఫామెన్స్ మెరుగుపరుచుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొన్ని సెట్టింగ్స్ లో మార్పులు చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి. ఇలా చేయడం వల్ల పర్ఫామెన్స్ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ప్లే స్టోర్ లో ఏవైనా యాప్స్ అప్డేట్ చేయాల్సి ఉందేమో వెంటనే గమనించండి.  ఇక పాత స్మార్ట్ఫోన్ లో యానిమేషన్ ఉంటే స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే యానిమేషన్ అన్నీ కూడా ఆఫ్ చేయండి. ఇక స్మార్ట్ ఫోన్ లో స్టోరేజ్ నుండి కూడా చెక్ చేయండి. అవసరం లేని యాప్స్, ఫైల్స్ అన్నిటిని కూడా వెంటనే డిలీట్ చేయడం వల్ల ఇక మొబైల్ పర్ఫామెన్స్ మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: