తెలంగాణకు వాన గండం.. పరిస్థితి ఏమిటి..?

MOHAN BABU
గత సంవత్సరం కంటే ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. వర్షాలు తక్కువ కొట్టిన ఇబ్బందే.. ఎక్కువ పడిన ఇబ్బందే.. అయితే వర్షాలు అనేవి మోతాదులో పడితేనే రైతన్నకు ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కానీ ఇంకా  
తెలంగాణ కు వాన గండం పొంచి ఉంది. మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం మరింతగా బలపడి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ తుపానుకు జావద్ గా నామకరణం చేశారు తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిస్సా, ఉత్తర కోస్తాంధ్ర తీరనికి చేరుకునే అవకాశం ఉంది. ఈనెల 14న తీరందాటే అవకాశం అధికారులు అంచనా వేస్తున్నారు.

నిన్న హైదరాబాదులో కుంభవృష్టి వర్షం కురిసింది. ఆగకుండా కురిసిన వర్షాల వలన కాలనీలు జలమయమయ్యాయి.

రోడ్లు నీటమునిగాయి, నాలాలు, డ్రైనేజీలు, రహదారులు ఏకమయ్యే సరికి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ లో రికార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అల్మాస్ గూడా చెరువు కట్ట తెగింది.

సరూర్ నగర్ తపోవన్ కాలనీకి చెందిన 37 ఏళ్ల జగదీష్ చింతలకుంట వద్ద నాలాలో పడి పోయాడు. చివరకు తాడు సాయంతో బయట పడ్డాడు. ఇక  చంపాపేట్ లోనూ ఓ వ్యక్తి మ్యాన్ హోల్ లో పడిపోతే స్థానికులు రక్షించారు. నిన్న రాత్రి దంచికొట్టిన వర్షానికి శంషాబాద్ లో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పై వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. భారీ వర్షానికి అప్పా చెరువుకు వరద ఉధృతి బాగా పెరిగింది. దీంతో అప్పా చెరువు నుంచి హైవే పైకి వరద నీరు చేరింది. దీంతో హైదరాబాద్ నగర వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: