పెట్రో మంట.. ఎలక్ట్రికల్ వాహనాల వైపే చూపంతా..?

MOHAN BABU
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒక మన ఇండియాలోనే సామాన్యునికి అందనంత ఎత్తుకు నిత్యావసర సరుకులు మరియు  పెట్రోల్ రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య జనాలు తలలు పట్టుకుంటున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాలను పక్కన పెట్టేసి, ఎలక్ట్రికల్ వాహనాలు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటుగా   ఇక వాయు కాలుష్యం కూడా ఎక్కువైంది. వీటిని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల కు డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీయ మార్కెట్ లోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ దారుల్లో హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ   ఒకటి. ఈ హోప్ ఎలక్ట్రిక్ త్వరలో దేశీయ మార్కెట్లో తన టాప్ అండ్ పర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ వాహనాన్ని  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు  OXO. ఈ OXO ని మార్కెట్లోకి తీసుకురావడం కోసం టెస్ట్ డ్రైవ్ చేస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి. ఈ బైక్ డిజైన్,స్టైలింగ్ స్పోర్ట్స్ బైక్ తరహాలో ఉన్నాయి.

ఇది ఆల్ ఎల్ఈడి సెట్ అప్ తో వచ్చే అవకాశం ఉంది. ట్రెండీ వైజర్, పియర్ ఆకారంలో టర్న్ ఇండికేటర్లు, స్లీట్ ఎల్ఈడి టిఆర్ఎల్,సింగిల్ సీట్ డిజైన్, షార్ట్ టేల్ సెక్షన్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి. బైక్ ఏరోడైనమిక్ ప్రొఫైల్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. OXO టాప్ స్పీడ్ గంటకు 80 నుంచి 90 కి. మీ వేగంతో ప్రయాణిస్తుందని సమాచారం. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు కోరుకునే అన్ని ఫీచర్లు ఈ కొత్త హోప్ OXO   ఎలక్ట్రిక్ బైక్ లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ఫీచర్లు వాహన ప్రియులను ఆకర్షించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: