టాటా మోటార్స్ ఎస్ యూవి కారులో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా..?

MOHAN BABU
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కస్టమర్లను ఎప్పటినుంచో ఊరిస్తున్న కొత్త మోడల్ కార్ వచ్చేసింది. టాటా పంచ్ మైక్రో SUV కార్లు అక్టోబర్ 4 న మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మోడల్ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఆల్ఫా ఏఆర్ సి యాంగిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్ డు ఆర్కిటెక్చర్ ప్లాట్ ఫామ్ ఆధారంగా పనిచేస్తుంది. టాటా మోటార్స్ కార్లలో పాపులర్ మోడల్ మాదిరిగా ఇంపాక్ట్ 2.0 డిజైన్  లాంగ్వేజ్ తో డెవలప్ చేసింది కంపెనీ. ఈ రోజు నుంచే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన కస్టమర్లు టాటా మోటార్స్  డీలర్ షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ లో 21000 చెల్లించి టాటా పంచ్ కొత్త కారును  వినియోగదారులు బుకింగ్ చేసుకోవచ్చు .

కస్టమర్ల కోసం టాటా మోటార్స్ పంచ్ కారు వర్చువల్ షోరూం కూడా లాంచ్ చేసింది. మనకు నచ్చిన ఏ వేరియంట్ కారు నైనా బుక్ చేసుకోవచ్చు. టాటా పంచ్ మోటార్ కారు ధర వివరాలను కంపెనీ ఇంకా రివిల్ చేయలేదు. కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్, 187mm  గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. Suv కార్లలో 370mm వాటర్ వాడింగ్ కాపబులిటి తో వచ్చింది. టాటా పంచ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో రన్ అవుతుంది. ఈ సరికొత్త కారు బురద దారిలో కూడా సులభంగా దూసుకెళ్తుంది.ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచడంతో పాటు ట్యూనింగ్ మాప్స్ కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు . ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇంజన్ ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో ఐడిల్ స్టార్ట్, స్టాప్ వంటి కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. టాటా పంచ్  ఇంటీరియల్ విశాలంగా ఉండేలా డిజైన్ చేసింది. కారులోని డాష్ బోర్డు 4 అంగుళాల లేదా 8 అంగుళాల హార్మోన్ సిస్టమ్ తో వచ్చింది.  స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ద్వారా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

టాటా పంచ్ కారు రియల్ సీట్లు బ్లాక్ ఫ్లోర్ తో సౌకర్యవంతమైన సీటింగ్ అమర్చారు. డ్రైవర్, ప్యాసింజర్స్ తమ వస్తువులను దాచుకునేందుకు 25 రకాల యుటిలిటీ స్టోర్స్ అమర్చారు. మైక్రో suv కార్ లో 366 లీటర్ల వుడ్ స్పేస్ కూడా అందించారు. అనేక సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంది. అందులో 2 ఎయిర్  బ్యాగులు AVS, EBD, కార్నర్ సేఫ్టీ కంట్రోల్, ఐ ఎస్ ఓ పిక్స్ వంటి ఫీచర్లు  ఆకర్షణీయంగా ఉన్నాయి. టాటా  పంచ్ కారు మొత్తం 7 కలర్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: