బుల్లి పిట్ట : విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త.. కోవిన్ యాప్ లో సరికొత్త ఫీచర్..!
విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా మనం చూపించవలసి ఉంటుంది. లేకపోతే ఆ దేశానికి ప్రయాణానికి మనకి అనుమతి ఉండదు.ఇక ఇప్పుడు తాజాగా విదేశాలకు ప్రయాణం చేసుకునేవారికీ, కొవిన్ యాప్ ఒక శుభవార్త తీసుకువచ్చింది. వ్యాక్సిన్ వేయించుకునే ముందు నుంచే సర్టిఫికెట్ ను మనం డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని అమలు చేస్తోంది ఈ యాప్.
మనం వేయించుకున్నాక వివరాలను కొవిన్ యాప్ లో పొందుపరుస్తారు. ఆ తర్వాత టీకా తీసుకున్నట్లుగా మనకొక సర్టిఫికెట్ కూడా జారీ అవుతుందట. ఇందుకుగాను సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీంతో ఇక మీదట విదేశీ ప్రయాణం మరింత సులువుగా మారనుంది. విదేశాలకు వెళ్తున్న వారు కరోనా సర్టిఫికెట్ కోసం కోవిన్ యాప్లో సర్టిఫికేట్ ను తీసుకుంటే చాలట.దీంతో సరికొత్త ఫ్యూచర్ ను తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఇక అంతే కాకుండా ఇందులో పుట్టిన తేదీని కూడా చూపిస్తుందట. ఇక మన అసలు పేరు , పుట్టిన దేశం తేదీ, వ్యాక్సిన్ వేయించుకున్న ప్రదేశం వంటి ఇతర విషయాలను కూడా ఇందులో చూపిస్తుందట. అంతే కాకుండా మనం ఏ తేదీలలో వ్యాక్సిన్ వేయించుకున్నామో కూడా ఇందులో పొందుపరుస్తుందట. మన పూర్తి వివరాలను ఇందులో సర్టిఫికెట్ రూపంలో పొందుపరిచి మనం డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించనుంది.
ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని ఆరోగ్య అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎస్ శర్మ, ఈ కోవిన్ యాప్ అప్డేట్ ను తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.