మీకు మోటార్ వాహనాలు ఉన్నాయా.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ఇబ్బందే..?

MOHAN BABU
 మీ ఇంట్లో బైకు, కారు ఇతరాత్ర మోటార్ వాహనాలు ఉన్నాయా అయితే వెంటనే మీరు ఈ పని చేయాల్సిందే లేదంటే చిక్కులు తప్పవు. జరిమానాలు  కూడా విధిస్తామని రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ నిబంధనలు పాటించని వాహనాలను తనిఖీ చేసి పట్టుకుంటా మన్నారు.  ఆంధ్రప్రదేశ్  వాహనదారులకు రవాణాశాఖ అలర్ట్ ప్రకటించింది. హైసెక్యూరిటీ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లు  తప్పనిసరిగా తనిఖీలు చేయాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వాహనదారుడు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను  తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో 2014 తర్వాత ఉన్నటువంటి కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అనేది  తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

2019 నుంచి వాహన డీలర్లకు నెంబర్లు ప్లేట్లు ఏర్పాటు చేసే బాధ్యతను కూడా అప్పగించామని, చాలా చోట్ల డీలర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల నీటిలో ఏర్పాటులో ఆలస్యం జరుగుతోందని అన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే వాహనదారులు కొన్ని ఫ్యాన్సీ నెంబర్లు ఏర్పాటు తీసుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తిరిగాడు వంటి వాహనాలను తనిఖీ చేసి పట్టుకోవాలని అధికారులకు ఆదేశించారు రవాణా శాఖ. దీంతోపాటుగా డీలర్ల దగ్గర ఎలాంటి ఆలస్యం జరగకుండా తనిఖీలు చేయాలని తెలిపారు. ముందస్తుగా దీనిపై అవగాహన కల్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటామని ఆ తర్వాత కేసు నమోదు చేస్తామని అన్నారు. అద్దె వాహనాలకు మరియు ప్రభుత్వ వాహనాలు ఖచ్చితంగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల వుండాలని తెలియజేశారు. వాహనాల నెంబర్ ప్లేట్ ప్రామాణికంగా ఉండడం లేదని దీంతో ఫిర్యాదు ఎక్కువగా వస్తుండడంతో రవాణాశాఖ స్పందించిందని, రవాణా శాఖ నిబంధనల ప్రకారం నెంబర్ పెట్టు అమర్చుకొని వారిని అప్రమత్తం చేసిన తర్వాత పోలీసులతో కలిసి మాత్రమే చర్యలు చేపడతామని అన్నారు. ఏపీ లోని ప్రతి వాహన డీలర్ వాహనం కొన్న ప్రతి కస్టమర్ కేర్ నెంబర్ పేరు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అన్నారు.

రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో డబ్బులు చెల్లిస్తున్నా చాలామంది వాహనదారులు నెంబర్ పెట్టు తీసుకోవడం లేదన్నారు. తోడుగా పండుగ సీజన్లో  ప్రైవేట్ బస్సులు  ప్రయాణికుల దగ్గర రెండు నుంచి మూడు రెట్లు టికెట్ ధరలు పెంచి వసూలు చేస్తున్నారని, వీటిని అరికట్టడం కోసం ఏంవిఐ లను  అప్రమత్తం చేశామన్నారు. అలాగే రవాణా పనులు కూడా చెల్లించకుండా తిరుగుతున్న  వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టమని, దీని కొరకు డి టి సి లకు ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: