ఢిల్లీ ఐఐటీ : వాన చినుకుల .. విద్యుత్ ..

దేశంలో జనాభా అధికంగా ఉండటంతో అనేక వనరుల అవసరం రానురాను పెరిగిపోతుంది. అందరికి కనీస అవసరాలు ఏర్పాటు చేయడానికి ఎప్పటికప్పుడు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంలోనే కొత్త కొత్త విధానాల ద్వారా వనరులను పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైనా వనరులు పరిమితంగానే ఉంటాయి. అందుకే ప్రతి వనరును వృధా చేయకుండా తగిన విధంగా వినియోగించుకోవడం అవసరం. ఒక్కసారి వనరు అడుగంటిపోతే వచ్చే ఇబ్బందులు చెప్పనలవి కావు. మనిషి సహా అనేక ప్రాణులకు జీవనాధారం అయినటువంటి నీరు, ఆహారం లాంటివి వృధా చేయకుండా తరువాత తరానికి అందుబాటులో ఉంచుకునే విధంగా వాడుకుంటూ ఉండాలి. ఇక అభివృద్ధిలో భాగంగా విద్యుత్ కూడా అవసరాల మేరకు అందుబాటులోకి వచ్చింది.
నేడు ప్రతి అవసరానికి విద్యుత్ వినియోగం జరుగుతుంది. దానికోసమే ప్రతి ఒక్కరిని విద్యుత్ అవసరం పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ దేశజనాభా అవసరాలకు మాత్రం సరిపోవడం లేదు. దీనివలన వివిధ రకాలుగా విద్యుత్ తయారీకి అనేక మార్గాలు కనిపెట్టారు. జలవిద్యుత్, ధర్మల్ విద్యుత్ తదితర మార్గాల ద్వారా ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అనంతరం అణువిద్యుత్, సౌర విద్యుత్ లు కూడా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ సామాన్యులకు అందుబాటులో లేకపోవడం తో ఇంకా అనేక రకాల ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
పెరుగుతున్న కాలుష్యం కూడా ఈ తరహా ప్రయోగాలు జరగడానికి కారణం అవుతుంది. ప్రస్తుతం చాలా చోట్ల విద్యుత్ వాహనాలు దర్శనం ఇస్తున్నారు. దీనికోసం సంస్థలకు అనేక ఉద్దీపనలు ఇచ్చి మరీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. వినియోగదారులకు కూడా అనేక ప్రోత్సహకాలు ఇస్తూ ఇటువంటి వాహనాల వినియోగానికి ఏర్పాట్లు చేస్తున్నాయి ఆయా  ప్రభుత్వాలు. ఈ దిశలోనే తాజాగా ఢిల్లీ ఐఐటీ కూడా ఒక వినూత్న పద్దతిలో కొద్దిపాటి సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం కనుగొన్నారు. వర్షపు నీటి బిందువుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.  ట్రైబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఇది సాధ్యం చేశారు. దీనిప్రకారం ఏవైనా రెండు వస్తువులు దగ్గరకు వచ్చినప్పుడు వాటిలో ఎలెక్ట్రాన్స్ మార్పు జరుగుతుందని, అప్పుడు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. చిన్న చిన్న పరికరాల ఛార్జింగ్ కు ఇది ఉపయోగపడుతుంది. దీని పేటెంట్ కోసం ఈ విద్యార్థులు దరఖాస్తు కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: