ఫేస్ బుక్ .. డైరెక్టర్ గా మాజీ ఐఏఎస్ ..

సామజిక మాధ్యమాలలో ప్రముఖంగా చెప్పుకుంటున్న ఫేస్ బుక్ పై ఎప్పటికప్పుడు అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మాధ్యమం వాడుతున్న వారి సమాచారం అనధికారికంగా వాడుకునట్టు కూడా అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి నుండి స్వయంగా ఫేస్ బుక్ రూపకర్త అనేక సార్లు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. దీనితో వినియోగదారుల సమాచారం సురక్షితంగానే ఉందని నిరూపించుకోవడానికి అనేక కొత్త రక్షణ వ్యవస్థలను పునరుద్దరించినట్టు సంస్థ అధినేత చెప్పారు. అలాగే విమర్శలు వస్తున్నప్పుడు ప్రతిసారి వాటిని కొత్త కొత్త ఫీచర్స్ తెస్తూ ఉండటం వలన దారిమళ్లిస్తున్నాడు. ఇప్పటికే ఫేస్ బుక్ అనేక సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. బిజినెస్, మాట్రినోనియల్ విభాగాలు అందులో భాగంగానే తీసుకొచ్చింది సంస్థ. ఇలా ఎప్పటికప్పుడు కొత్త సేవలు తెస్తూ విమర్శల ద్వారా పోతున్న వినియోగదారులను అందిపుచ్చుకుంటుంది.  
అయితే రాజకీయాల సందర్భంగా కూడా ఎన్నికల సమయంలో అనేక విమర్శలు ఈ మాధ్యమం ద్వారానే ప్రచారం చేస్తున్నారు. దీనితో అనవసరమైనవి ఫేస్ బుక్ ప్రచారం అనేక సమస్యలు వస్తున్నాయని ఆయా పార్టీలు పిర్యాదు చేయడంతో ఇది కూడా ఒక సమస్యగా అయ్యింది. అందుకే మరోసారి ఇండియా ఫేస్ బుక్ వినియోగదారుల సమాచార రక్షణ, గోప్యత, ఇంటర్నెట్ తదితర విషయాల అమలులో పబ్లిక్ పాలసి విభాగానికి మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ అగర్వాల్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు గత అధికారిపై విమర్శలు రావడంతో కొత్త డైరెక్టర్ నియామకం చోటుచేసుకుంది.
రాజీవ్ గతంలో ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ పరివేక్షణలో పనిచేశారు. దానికి ముందు 26ఏళ్ళ పైగా వివిధ ఉన్నత పదవులలో రాజీవ్ ప్రభుత్వం కోసం పనిచేశారు. యూపీలో కూడా జిల్లా కలెక్టర్ గా ఆయన విధులు నిర్వర్తించారు. దేశంలోనే మొదటిసారిగా మేధోహక్కుల సంబంధించి నేషనల్ పాలసీ విధానపర నిర్ణయాలు రూపకల్పనలో కీలకంగా ఉన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ పారిశ్రామిక ప్రోత్సహకాలు, అంతర్గత విభాగంలో సంయుక్త కార్యదర్శిగా కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: