బుల్లి పిట్ట : వాటర్ గీజర్ కొనేవారు..ఈ విషయాలు తెలుసుకోవాలి..!

Divya
మనం ఈ మధ్య కాలంలో ఇళ్ళల్లో ఎక్కువగా నీటిని కాంచుకునేందుకు ఎలక్ట్రిక్ పరికరాలని వాడుతున్నాం. కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కొనడం ఆషామాషీ అయిన విషయం కాదు. ఇక గీజర్ తీసుకునేటప్పుడు ఎలాంటి వాటిని తీసుకోవాలి.. ముందుగా ఎలాంటి విషయాలను గమనించాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
గీజర్ మనం తీసుకునేటప్పుడు చాలా పెద్దదిగా ఉండాలా.. చిన్నదిగా ఉండాలో అనేది బాత్రూం లో ఉండే స్థలాన్ని బట్టి తీసుకోవడం మంచిది. అంతేకాదు మన ఇంట్లో మనుషులకు సరిపోయేంత నీటిని కాన్చే  పరిమాణంతో ఉండేలా  తీసుకోవాలి. పెద్ద గీజర్ తీసుకున్నట్లయితే.. అధిక కరెంటు బిల్లును వినియోగించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా  గీజర్ కొనాలనుకునేటప్పుడు ధర్మో స్టార్ట్ ,పరిమాణం ,నాణ్యత, సామర్థ్యం మొదలైన విషయాలను కూడా గమనించాలి.
గీజర్ యొక్క జీవిత కాలంతో పాటు అన్ని సమీక్షలను కూడా ఒకసారి చూసిన తర్వాతనే గీజర్ తీసుకోవడం మంచిది. ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన గీజర్లు మాత్రమే తీసుకుంటే , కరెంట్ బిల్లు ఆదా అవుతుంది . ఒకవేళ స్టార్ రేటింగ్ ల సంఖ్య తక్కువ ఉన్నట్లయితే ,కరెంట్ బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది.. ఒకసారి గీజర్ కొనేటప్పుడు ఎంతకాలం వారెంటీ ఇస్తారు అనే విషయాన్ని కూడా గమనించాలి. తీసుకున్న తర్వాత మొత్తం యూనిట్ కే వారంటీ లభిస్తుందా..? లేక అందులో ఉన్న కొన్ని భాగాలకు మాత్రమే వారెంటీ లభిస్తుందా..? అనేది కూడా చూసుకోవాలి.

మార్కెట్లో మంచి పేరున్న గీజర్ లని తీసుకోవడం ఉత్తమమైన లక్షణం. ఇక వీటితో పాటు అదనంగా సర్దుబాటు చేసుకోగలిగే ఆటోమేటిక్ ధర్మల్ కటౌట్, ప్రెజర్ కోసం సేఫ్టీ వాల్, గ్లాస్ కోటెడ్ హీటింగ్, ధర్మో స్టార్ట్ సెట్టింగ్స్, ఆటో ఫీచర్ లాంటివి కూడా విద్యుత్తును ఆదా చేస్తాయి. ఒక్కోసారి గీజర్ వేడెక్కినప్పుడు హీటర్ కాలిపోకుండా ,ఈ ఆటో ఫీచర్ అనేది నిరోధిస్తుంది. అంతేకాదు ఒత్తిడిని తగ్గించి వేడి నీటిని అందించడానికి ఈ ఆటో ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది.. కాబట్టి ముఖ్యంగా ఈ అన్ని అంశాలను మీరు తప్పకుండా గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: