నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్... ఆటోమేటిక్‌గా రీఛార్జ్
నెట్‌ఫ్లిక్స్‌లో ఆటోపే ఫీచర్ త్వరగా రావాలని వినియోగదారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం కంపెనీ యూపిఐ ఆటో-పే చెల్లింపు ఫీచర్‌ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది మీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ముగియగానే స్ట్రీమింగ్ అవ్వడం ఆగకుండా చేస్తుంది. బదులుగా అది మీ యూపిఐ ఖాతా నుండి ఆటోమేటిక్ గా రీఛార్జ్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ కోసం వినియోగదారులు యూపిఐ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. యూపిఐ ఆటోపే ఫీచర్ కొత్త, ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. యూపిఐ ఆటోపే ఫీచర్ నెట్‌ఫ్లిక్స్ ఆండ్రాయిడ్ యూజర్లకు netflix.com లో అందుబాటులో ఉంటుంది.
ఆటోపే ఫీచర్ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇండియా పేమెంట్స్ హెడ్ గుంజన్ ప్రధాన్ మాట్లాడుతూ “మేము వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ, నియంత్రణను ఇవ్వాలనుకుంటున్నాము. యూపిఐ ఆటో పేతో మా సభ్యులు మరింత సౌలభ్యాన్ని పొందుతారని మేము ఆశిస్తున్నాము" అన్నారు.
ఈ ఫీచర్‌ని ఎలా ఎంచుకోవాలంటే?
- మీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాకు లాగిన్ అవ్వండి. మీరు ఇప్పటికి యూజర్ కాకపోతే మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి క్రొత్తదాన్ని సృష్టించండి.
- ఆల్రెడీ యూజర్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. అందులో పే, బిల్లింగ్ పద్ధతులని మార్చాలి. అందులో యూపిఐ ఆటో పే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
- కొత్త వినియోగదారులు రూ. 499, రూ.199 నుండి రూ.799 లేదా 699 రూపాయల మొబైల్ ప్లాన్ బ్రౌజర్‌ని ఎంచుకోవచ్చు.
- యూపిఐ ఆటో పే ఎంపిక తరువాత వినియోగదారుల నుంచి చెల్లింపుకు సంబంధించిన వివరాలు అడుగుతుంది.
- యూపిఐ ఆటోపే పద్ధతిలో వినియోగదారులు వారి paytm లేదా UPI id ని ఎంటర్ చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీకు ప్లాన్‌కు సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.