భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్10 ప్రయోగం విఫలమవ్వడం జరిగింది.నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10ని ప్రయోగించడం జరిగింది. ఇక బుధవారం ఉదయం 3.43 గంటల నుంచి ప్రారంభమైన కౌంట్‌డౌన్.. నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగాక వాహకనౌక నింగిలోకి వెళ్లడం జరిగింది. అయితే, జీఎస్ఎల్వీ ఎఫ్-10 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి చేరడంలో విఫలమవ్వడం జరిగింది.ఇక రెండు దశల వరకు విజయవంతంగా ఆకాశంలోకి దూసుకెళ్లిన రాకెట్‌లో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ దగ్గర సాంకేతిక సమస్య అనేది తలెత్తింది. దీంతో ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో జీఎస్ఎల్వీ పయనించడం జరిగింది. ఇక ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురయిన ఇస్రో శాస్త్రవేత్తలు లైవ్‌సోర్స్‌ను నిలిపి వేయడం జరిగింది.
ఇక జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించడం జరిగింది.ఇక ఈ ప్రయోగం ద్వారా జీఐశాట్-1 ఉపగ్రాహన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. కానీ అప్పటికి కూడా వారు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఇక భారత భూపరిశీలన ఉపగ్రహాల్లో కీలకంగా భావిస్తోన్న జీఐశాట్-1 గత సంవత్సరం మార్చిలోనే ప్రయోగించాలని నిర్ణయించడం జరిగింది. ఇక అయినప్పటికీ సాంకేతిక సమస్యలతో ఈప్రయోగం రెండు సార్లు వాయిదా పడటం జరిగింది.మార్చి 5, 2020న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడటం జరిగింది.ఇక ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌కు పది నిమిషాల ముందే సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేశారట. సుమారుగా 2,275 కిలోల బరువున్న జీశాట్-1 అనేది అత్యాధునిక భూ పర్యవేక్షిత ఉపగ్రహం. ఇక దీని ఉద్దేశ్యం దేశ రక్షణ వ్యవస్థకు తోడ్పాటునందించడంతోపాటు విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపాలని ఇస్రో భావించడం జరిగింది.