ఈ యాప్ తో కరోనా పూర్తి వివరాలు మీ చేతిలో ?

VAMSI
కాలానికి తగినట్లుగా టెక్నాలజీ రకరకాల మార్పులను తీసుకువస్తోంది. అయితే ఈ టెక్నాలజీని కొందరు మానవాళి అభివృద్ధికి ఉపయోగిస్తుంటే మరి కొంతమంది మాత్రం మానవ వినాశనానికి వాడుతున్నారు. ఇప్పుడు అమెజాన్ అలెక్సా ఒక కొత్త ఫీచర్ ను తీసుకువచ్చినట్లుగా అధికారికంగా తెలియచేసింది. మన దేశాన్ని గత రెండు సంవత్సరాల నుండి పట్టి  పీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఎంతో నష్టపోయాము. కరోనా వైరస్ కు సంబంధించి కొన్ని విషయాలలో ఈ అమెజాన్ అలెక్సా మానవాళికి ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అలెక్సా ద్వారా మనకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల వివరాలను తెలుసుకోవచ్చు. చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా పట్టణాలలో ఎక్కడెక్కడ వ్యాక్సిన్ సెంటర్స్ ఉన్నాయో తెలియక సకాలంలో వ్యాక్సిన్ ను తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అలెక్సా వీరికి చక్కగా ఉపయోగపడనుంది. అమెజాన్ కొత్తగా ప్రవేశ పెట్టిన అప్డేట్ లో వ్యాక్సిన్ మరియు కరోనా టెస్టులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా అమెజాన్ అలెక్సా ప్రజలకు కోవిడ్ 19 కు సంబంధించిన సేవలను అందించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్సైటు మరియు మ్యాప్ మై ఇండియా వారి పోర్టల్ తో అనుసంధానం చేయబడ్డారు. ముందుగా మనము చెప్పుకున్న ప్రకారం ఈ అలెక్సా ద్వారా కరోనా టెస్ట్, వ్యాక్సిన్ సెంటర్, వ్యాక్సిన్ అవైలబైలిటీ, హెల్ప్ లైన్ నంబర్స్ మరియు కోవిడ్ 19 కు చెందిన ఎటువంటి సమాచారాన్ని అయినా ఈ అలెక్సా ద్వారా పొందవచ్చు.

అంతే కాకుండా ముందు ముందు కోవిడ్ 19 కోసం అందిస్తున్న విరాళాలను సేకరించడానికి అనువుగా ఉండడానికి అమెజాన్ అక్షయపాత్ర, గివ్ ఇండియా మరియు గూంజ్ లాంటి ఎన్జీఓ లతో కలిసి కలవడానికి ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా ఈ అలెక్సా అప్డేట్ ను ఉపయోగించుకుని కోవిడ్ కు సంబంధించి మీకు అవసరమయిన అన్ని రకాల వివరాలను సులభంగా పొందవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: