ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) టెక్నాలజీ సహాయంతో పేటిఎమ్, గూగుల్ పే ఇంకా ఫోన్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ అనేవి పనిచేస్తున్నాయి. వీటి వల్ల చాలా సులభంగా మనం మనీ ట్రాన్సక్షన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇక చాలా మంది వినియోగదారులు కూడా యుపీఐతో లింక్ చేయబడిన వారి ఫోన్లలో కనీసం ఈ మూడింటిలో ఒక పేమెంట్ యాప్స్ అయిన వాడుతూ వుంటారు.యుపీఐ ద్వారా ఎవరికైనా డబ్బును క్షణాలలో సులభంగా బదిలీ చేయవచ్చు.ఇక పొరపాటున ఎవరైనా మీ ఫోన్ యాక్సెస్ చేస్తే వారు డబ్బును బదిలీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పేమెంట్ యాప్స్ గల స్మార్ట్ ఫోన్ ను ఎవరైనా దొంగలించిన కాని లేక ఫోన్ పోయిన ఏమి జరుగుతుంది? వారు మీ బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బును క్షణాల్లో డ్రా చేసే అవకాశం ఉంటుంది.కాబట్టి మీ స్మార్ట్ ఫోన్ ఎవరైనా కోల్పోయినట్లయితే లేదా ఎవరైనా దొంగలించినట్లయితే తక్షణమే ఈ సర్వీసులు యాక్సెస్ చేసుకోకుండా మనం చేయవచ్చు.
మీ ఫోన్ పోతే పేటిఎమ్, గూగుల్ పే ఇంకా ఫోన్ పేని మీరు ఏ విధంగా బ్లాక్ చేయాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకోండి. ఇలా బ్లాక్ చేయడం వల్ల వారు మీ ఖాతాలో నుంచి డబ్బును ఎవరూ కూడా డ్రా చేయలేరు.ఇక పేటిఎమ్ యూజర్స్ పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబరు 01204456456కు కాల్ చేయండి.పోయిన ఫోన్ కొరకు ఆప్షన్ ఎంచుకోని వారి సూచనలు ప్రకారం బ్లాక్ చెయ్యండి.ఇక గూగుల్ పే వినియోగదారులు అయితే హెల్ప్ లైన్ నంబర్ 18004190157కు కాల్ చేసి మీ మాతృ భాషను ఎంచుకోని కస్టమర్ కేర్ ఇచ్చే సూచనలు ప్రకారం బ్లాక్ చేసుకోండి.అలాగే ఫోన్ పే వినియోగదారులు అయితే 08068727374 లేదా 02268727374 కాల్ చేయాల్సి ఉంటుంది.అలా ఈ నంబర్లకు కాల్ చేసి మీ అకౌంట్స్ ని ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు..కాబట్టి ఎప్పుడైనా ఫోన్ పోయినప్పుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఇలా చెయ్యండి. మీ డబ్బుని చాలా సురక్షితంగా ఉంచుకోండి.