సత్తా చాటిన జియో.. దేనిలో తెలుసా?

ఇక రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో అనేది పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. అప్పటిదాకా వేరే నెట్వర్క్ ల చార్జీలతో విసిగిపోయిన జనాలకు రిలయన్స్ జియో తన అత్యుత్తమ ఆఫర్ తో ఎంతగానో ఉర్రూతలూగించింది.ఇక రిలయన్స్ జియో ఎప్పటిలాగే మరోసారి తన సత్తా చాటడం జరిగింది.ఇక 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ పరంగా చూసుకున్నట్లయితే మరోసారి జియో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇక జూన్ నెలలో డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ విషయంలో ఇతర నెట్‌వర్క్‌ల కంటే సెకనుకు సరాసరి 21.9 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో జియో నెట్‌వర్క్‌ అన్నింటి కంటే ముందు నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్‌ ట్రాయ్‌ ఒక రిపోర్టులో తెలిపడం జరిగింది. అలాగే, వోడాఫోన్‌ ఇంకా ఐడియా అప్‌లోడింగ్‌ స్పీడ్‌ పరంగా జియో ముందంజలో ఉంది.
ఇక వోడాఫోన్‌ సుమారు 6.2 ఎమ్‌బీపీఎస్‌ అప్‌లోడ్ స్పీడ్‌ పరంగా అన్నింటితో పోలిస్తే ముందు ఉంది.ఇక రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ వేగం గత నెలతో(20.7 ఎమ్‌బీపీఎస్‌) పోలిస్తే ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. ఇక జియోకి సమీప పోటీదారుడు అయిన వోడాఫోన్ ఐడియా(డౌన్‌లోడ్ వేగం 6.5 ఎమ్‌బీపీఎస్‌) కంటే మూడు రెట్లు ఎక్కువగా వుంది.  ఇక టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎయిర్‌టెల్ 4జీ డౌన్‌లోడ్ వేగం కొంచెం పెరగిందనే చెప్పాలి. ఇక ఇప్పటికీ 5 ఎమ్‌బీపీఎస్‌ డౌన్‌లోడ్ వేగంతో ఇది కనిష్ట స్థాయిలో ఉంది. ఇక ట్రాయ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వోడాఫోన్ ఐడియా మే నెలలో సగటున 6.2 ఎమ్‌బీపీఎస్‌ అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉండటం విశేషం. ఇక దాని తర్వాత రిలయన్స్ జియో 4.8 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో, ఇంకా భారతి ఎయిర్‌టెల్ 3.9 ఎమ్‌బీపీఎస్‌ స్పీడ్ తో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: