బుల్లి పిట్ట: ట్విట్టర్ లో అవి ఓపెన్ కావడం లేదు.. కారణం..

Divya
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హవానే ఎక్కువగా కొనసాగుతోంది. ఏదైనా విషయంపైన కొత్త అప్డేట్ వచ్చినా ఎక్కువగా ట్విట్టర్ లో పోస్ట్ పెడుతున్నారు. ఒక సామాన్య వ్యక్తి నుంచి దేశ ప్రధాని వరకు, అలాగే వివిధ దేశాల ప్రధానమంత్రులు, ప్రజలు కూడా ట్విట్టర్ ద్వారా తమ సందేశాన్ని ఇతరులకు పంపుతున్నారు. అయితే దాదాపు కొన్ని దేశాలలో ట్విట్టర్ నిషిద్ధం అన్న విషయం తెలిసిందే. ఇక మిగతా దేశాల విషయానికి వస్తే, అన్ని దేశాల ప్రజలందరూ ట్విట్టర్ ద్వారా తమ సందేశాలు పంపుతూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. కానీ అలాంటి ఎంతో మంది నెటిజన్లు.. ఈ రోజు ట్విట్టర్ లో అంతరాయం కలిగింది అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అలా ఎందుకు జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.

ట్విట్టర్ సేవలో ప్రొఫైల్ సరిగా లోడ్  అవడంలేదని, అలాగే పలు థ్రెడ్ లు కూడా ఓపెన్ అవ్వడం లేదని నెటిజనులు పేర్కొన్నారు. కానీ కొన్ని అతి ముఖ్యమైన ఫీచర్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయని వారు తెలపడం జరిగింది. ముఖ్యంగా వారి ఖాతాలకు సంబంధించిన టైం లైన్  కూడా ఓపెన్ కావడం లేదని, దాంతో కొన్ని సందేశాలకు తిరిగి సమాధానం కూడా పంపలేక పోతున్నామని వారు వాపోతున్నారు.

అంతేకాదు వాటిని ఓపెన్ చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎర్రర్ మెసేజ్ అని చూపిస్తోందని వారు చెబుతున్నారు. ఎందుకు జరుగుతోంది అంటూ నెటిజన్లు ట్విట్టర్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం గమనార్హం. అయితే డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ఈరోజు అనగా జూలై 1వ తేదీ ఉదయం 7 గంటల 32 నిమిషాల నుండి ఈ  ట్విట్టర్ ను  ఉపయోగిస్తున్న ఎంతో మంది యూజర్లు ఈ సమస్య గురించి చెప్పడం గమనార్హం. అంతేకాదు ఒక రోజు నుంచి ట్విట్టర్ సరిగ్గా పనిచేయడం లేదని దీనికి సంబంధించిన ఫిర్యాదులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని డౌన్  డిటెక్టర్ తెలిపింది. ముఖ్యంగా గత రాత్రి నుంచి 6 వేలకు  పైగా మెసేజ్ ద్వారా ట్విట్టర్ వినియోగదారులు, ఈ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. కానీ ఇప్పటివరకు ట్విట్టర్లో ఎలాంటి అంతరాయం కలగలేదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతోంది అంటూ నెటిజనులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనికి కారణం ఏమిటో ఇప్పటి వరకు ట్విట్టర్ స్పందించలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: