వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాగా ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. ఇక ఇది ఎండ్-టు-ఎండ్ ఎంక్రిప్షన్ తో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం అనే విషయం తెలిసిందే. ఇక వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అయితే వాట్సాప్ మొదట ఏదైనా ఫీచర్ ని బీటా వెర్షన్‌లో రిలీజ్ చేస్తుంది.తరువాత అన్ని వెర్షన్ లలో రిలీజ్ చేస్తూ అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఇక ఆన్‌లైన్ స్టేటస్ కి సంబంధించి వాట్సాప్ బీటా వెర్షన్‌లో మరో ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్ చేస్తుందట. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కొత్త అప్ డేట్ తరువాత ఆన్‌లైన్ స్టేటస్ అనేది ఇక కనిపించదు. సాధారణంగా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ తో గాని లేక మరెవరైనా వాట్సాప్ యూజర్‌తో గాని చాట్ చేస్తున్నప్పుడు వారి స్టేటస్ ఆన్‌లైన్ అని చూపిస్తుంది. కాని ఈ కొత్త అప్‌డేట్ తర్వాత ఈ ఫీచర్ అనేది వాట్సాప్ బిజినెస్ ఖాతాకి కనిపించదు.
ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. ఇక 2018వ సంవత్సరంలో, వాట్సాప్ బిజినెస్ యాప్‌ను లాంచ్ చేయడం జరిగింది. అప్పుడే ఇక ఈ ఆన్‌లైన్ స్టేటస్ ఫీచర్‌ను కూడా యాప్‌లో చేర్చారు, కానీ ఇప్పుడు ఇక మూడేళ్ల తర్వాత దాన్ని తొలగించడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ ఈ కొత్త అప్ డేట్ గురించి WABetaInfo సమాచారం ఇవ్వడం జరిగింది.ఇక WABetaInfo ప్రకారం అయితే ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్ అండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.13.17లో చూడవచ్చునట. ఈ అప్డేట్ తర్వాత వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ని ఉపయోగించేవారు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నారో లేదో అనేది మీకు తెలియదు.అలాగే ఈ కొత్త అప్ డేట్ తర్వాత, ఆన్‌లైన్ స్టేటస్ తో పాటు లాస్ట్ సీన్ కూడా మీరు చూడలేరు.ఇక ఈ ఫీచర్ ఆఫీషియల్ లాంచ్ గురించి అయితే వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు.