హుర్రే.. వాట్సాప్‌ లో మరో ఐదు కొత్త ఫీచర్స్..

Satvika
ప్రస్తుతం యువత ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా యాప్ ఈ వాట్సాప్‌.. అయితే ఇటీవల కాలంలో చాలా మంది వాట్సాప్‌ డేటా హ్యాకర్స్ చేతికి వెళ్ళింది. సెక్యూరిటీ కావాలని వాట్సాప్‌ ను కోరారు.. దీంతో ఆ సంస్థ సరికొత్త టెక్నాలజీ ను రూపొందించారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా మరో ఐదు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి.

అలాంటి మరిన్ని ఫీచర్స్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందించేందుకు వాట్సప్ ప్రయత్నాలు  చేస్తుంది. మల్టీ డివైజ్ సపోర్ట్, మిస్డ్ గ్రూప్ కాల్స్ లాంటి ఫీచర్స్  కూడా ఉన్నాయని సంస్థ పేర్కొన్నారు. అయితే ఈ ఫీచర్స్ ను ఎలా వాడుతారు.. వీటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వ్యూ వన్స్ ఫీచర్:
మీకు వాట్సాప్ ద్వారా వచ్చే ఫోటోలు, వీడియోలు నిండిపోతున్నాయా? అయితే ప్రతిదానిని  డౌన్ లోడ్ చేయకుండా కేవలం ఒకసారి చూసే వెసులుబాటును ఈ ఫీచర్ అందిస్తుందట..

రీడ్ లేటర్:
ఈ ఫీచర్ పేరు లోనే అర్థం ఉంది. అత్యవసర మెసేజ్ లు, లేదా చాట్ ను వీలైనప్పుడు చదువుకోవచ్చు..
గ్రూప్ కాల్స్ మిస్ అయితే:
ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అయినా కూడా వాట్సాప్‌ గ్రూప్ కాల్ లో మాట్లాడుతారు.. మనకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బిజీ గా ఉండి ఆన్సర్ చేయలేకపోతే మనం కూడా వారితో మధ్యలో జాయిన్ కావొచ్చు. ఇందుకు ఈ ఫీచర్ ను వాడుతారు.
మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌:
ఈ ఫీచర్ చాలా ముఖ్యమైనది.. మాములుగా వాట్సాప్ ను ఒక డివైస్ కు మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఎన్ని డివైస్ లకు అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది.

 వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్:
ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. గ్రూప్స్‌కి మాత్రమే ఈ ఫీచర్ ఉంది. త్వరలో అన్ని ఛాట్ థ్రెడ్స్‌కి ఈ ఫీచర్ తీసుకురానుంది.
ఇది వాట్సాప్ తీసుకొస్తున్న ఆ సరికొత్త ఐదు ఫీచర్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: