మరింత ఆలస్యం కానున్న Mi 11 అల్ట్రా..

ఎంఐ ఫోన్లకి ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండియాలో ఈ బ్రాండ్ అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ఇవి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉంటాయి.షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 23న విడుదల అయిన సంగతి తెలిసిందే. అదే రోజున ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని కూడా పరిచయం చేసింది షియోమీ. ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్స్ సేల్ మొదలైన ఎంఐ 11 అల్‌ట్రా సేల్ ఇంకా మొదలుకాలేదు. ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యి చాలా రోజులు గడిచిపోయిన సేల్ జరగకపోవడం టెక్ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక షియోమీ ఫ్యాన్స్ కూడా ఎంఐ 11 అల్‌ట్రా సేల్ ఎప్పుడు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.షియోమీ ఇండియాలో ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్లను ఎందుకు సేల్ కు తీసుకురావట్లేదనే చర్చ నడుస్తుంది.


ఈ చర్చలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు షియోమి క్లారిటీ ఇవ్వడం జరిగింది. తమ కంట్రోల్‌లో లేని కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఎంఐ 11 అల్‌ట్రా షిప్‌మెంట్ ఆలస్యం అవుతుందని, వీలైనంత త్వరలో ఖచ్చితంగా సేల్ తేదీలను ప్రకటించి మార్కెట్ లోకి తెస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ల కారణంగా షియోమీ సరఫరా, ఉత్పత్తి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని స్పష్టంగా అర్ధమవుతుంది.


ఇక ఈ ఆకట్టుకునే షియోమి ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే...ఇది 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే తో డిసైన్ చెయ్యబడింది.అలాగే దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.అంతేగాక ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ తో పని చెయ్యడం విశేషం.ఇక అలాగే కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.అలాగే 48 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది.దాంతో పాటు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,5,000ఎంఏహెచ్ బ్యాటరీ,67వాట్ ఫాస్ట్ వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్,10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.ఇక ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేస్తుంది.ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 12జీబీ+256జీబీ ఉంటుంది. ఇక వేరియంట్ ధర వచ్చేసి మార్కెట్ లో రూ.69,990/- గా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: