హ్యాపీ సండే: ఈ వారం టెక్ కబుర్లు ఇవే..?

Suma Kallamadi
ఈ వారం రోజుల సమయంలో టెక్నాలజీకి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఉపయోగపడే 5 ఉత్తమ వార్తలను ఈ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నాం.

1. రియల్ మీ సీ25ఎస్ స్మార్ట్ ఫోన్‌ మలేషియాలో లాంచ్ అయ్యింది. త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ కానుంది. ఆ దేశంలో నిర్దేశించబడిన ధర ప్రకారం మన దేశంలో రియల్ మీ సీ25ఎస్ ఫోన్ రూ.12-13 వేల ధర తో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పనిచేయనున్న రియల్ మీ సీ25ఎస్ లో 48 మెగాపిక్సెల్‌ మెయిన్ కెమెరా.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.


2. రిలయన్స్ జియో - గూగుల్ కలిసి చౌకైన 5జీ మొబైల్ ఫోన్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే చౌకైన 5జీ ఫోన్ తయారు చేసే విషయంపై దృష్టి సారించామని వెల్లడించారు. కాగా, 2021 డిసెంబర్ నాటికి జియో - గూగుల్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


3. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారతదేశంలో లాంచ్ కానుందని పోకో కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం జులై-సెప్టెంబర్ లోపు పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయని కూడా వెల్లడించింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 23 వేల వరకు ఉంటుందని సమాచారం.


4. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫోన్ ఇండియాలో నిర్వహించే సమ్మర్ ఈవెంట్ లో లాంచ్ చేస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. ఐతే ఈ ఫోన్ ధర సుమారు 53 వేల రూపాయలు ఉండనుందని తెలుస్తోంది.


5. జియో, ఐటెల్ కంపెనీలు కలిసి అత్యంత చౌకైన ఫోన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐటెల్ ఏ23 ప్రో గా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.3,899 కాగా.. ఇది జూన్ 1వ తేదీ నుంచి సేల్ లోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: