బుల్లిపిట్ట :అతి తక్కువ ధరకే వన్ ప్లస్ టీవీ !

Divya

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా కనిపెడుతూనే ఉన్నారు. అలాగే చైనా టెక్ దిగ్గజాలు స్మార్ట్ టీవీ ల తయారీలో ఎంతో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అక్కడి నుంచి పలు ఆండ్రాయిడ్ టీవీ లను  తీసుకురాగా, ఇప్పుడు తాజాగా వన్ ప్లస్..ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను కూడా ప్రవేశపెట్టింది . మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్  రంగంలో చాలా అద్భుతాలు సృష్టించిన చైనా కు చెందిన కొన్ని టెక్ దిగ్గజాలు,ఇప్పుడు స్మార్ట్ టీవీ  రంగంలో తమ సత్తా చాటుతున్నాయి.


ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ఫోన్ దిగ్గజం   వన్ ప్లస్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో భారత్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీ ని మన ముందుకు తీసుకు వచ్చింది వన్ ప్లస్.
వన్ ప్లస్ 40 వై 1 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచెస్, ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.
ఈ 40 ఇంచెస్ గల స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరలో అంటే రూ.21,999 గా  నిర్ణయించారు. అందులోనూ వన్ ప్లస్ వంటి బడా బ్రాండ్ నుంచి ఆండ్రాయిడ్ టీవీ రావడం మరో విశేషం. వన్ ప్లస్ నుంచి ఆండ్రాయిడ్ టీవీ విడుదలవడం తో వన్ప్లస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

ఒకవేళ ఈ స్మార్ట్ టీవీ ని హెచ్ డీ ఎఫ్ సీ కార్డ్ తో కొనుగోలు చేస్తే,వారికి 10% డిస్కౌంట్ కూడా లభించనుంది. దీంతో  సుమారుగా రూ.2000 వరకు తగ్గే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ టీవీ లో గూగుల్ అసిస్టెంట్ తో పాటు, గూగుల్ ప్లే స్టోర్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.

ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ లో అతి తక్కువ ధరకే లభ్యమవుతున్న ఈ టీవీ ని సులభంగా కొనుగోలు చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: