బుల్లి పిట్ట: ఫ్లిప్కార్ట్ లో భారీ డిస్కౌంట్ సేల్.. వాటిపై 50% డిస్కౌంట్
ప్రముఖ దిగ్గజ ఈ - కామర్స్ సంస్థలలో "ఫ్లిప్కార్ట్ " కూడా ఒకటి. ఫ్లిప్కార్ట్ లో మనకి అనేక ఉత్పత్తులు నాణ్యతతో, తక్కువ ధరలకే లభిస్తుంటాయి. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త డిస్కౌంట్ సేల్ ను ఆరంభిస్తూ ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ అయితే ఇప్పుడు కూడా సరికొత్త డిస్కౌంట్ సేల్ ను నిర్వహించబోతోంది. ఇక ముఖ్యంగా ఎవరైతే టీవీ కొనాలనుకుంటున్నారో అలాంటి వారికి ఫ్లిప్కార్ట్ ఒక శుభవార్త తీసుకువచ్చింది. అదేమిటంటే, ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 50% భారీ డిస్కౌంట్ తో పెద్ద స్మార్ట్ టీవీ సేల్ ని నిర్వహించబోతోంది.ఈ ఫ్లిప్కార్ట్ ద్వారా అతి పెద్ద 4K స్మార్ట్ టీవీ ని కేవలం రూ.30 వేల కంటే తక్కువ ధరలకే పొందవచ్చు. అయితే తక్కువ ధరలకే స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది.
అంతేకాకుండా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డు తో EMI ఆప్షన్ లో కొనాలను కొనేవారికి 10% రాయితీ కూడా లభిస్తుంది. దీంతోపాటు నో కాస్ట్ ఈఎమ్ఐ తో కేవలం రూ.1,006 తక్కువ EMI తో కూడా ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది.
ఇక టీవీ ఆఫర్ వివరాల్లోకి వెళితే, రూ.58,990 విలువగల టీవీ ఇఫ్ఫాల్కన్ బై టీసీఎల్ యొక్క 50 ఇంచ్ అల్ట్రా హెచ్డీ (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం 28,999 రూపాయలకే లభిస్తోంది. ఈ టీవీ 4కె అల్ట్రా హై డెఫినేషన్ తో పాటు అలాగే 50 ఇంచ్ తో కలిగి ఉంటుంది. ఇది హెచ్డీర్ 10 సపోర్టు అలాగే డాల్బీ ఆటమ్స్ సౌండ్ సపోర్టును కలిగి ఉంటుంది.
ఇక పిక్చర్ విషయానికి వస్తే, మంచి పిక్చర్ క్వాలిటీని కలిగి ఉంటుంది. 3HDMI ,2USB మరియు 3.5MM హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ అలాగే A1 ప్రోడక్ట్ తో వస్తుంది. ఈటీవీలో సౌండ్ పరంగా బాక్స్ స్పీకర్స్ లభిస్తాయి . పెద్ద సౌండ్ కలిగి ఉండి, గొప్ప పిక్చర్ క్వాలిటీ ని కేవలం రూ.30 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీని అందించనుంది ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.
అయితే మరెందుకు ఆలస్యం తక్కువ ధరకే ఈ టీవీని కొనాలనుకునేవారు తీసుకోండి.