ఫేస్ బుక్ లోని వీడియోలను ఇలా డౌన్ లోడ్ చేయవచ్చట..!
ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సోషల్ నెట్ వర్క్ మీద అవగాహన ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరూ వాట్సాప్,ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లను వాడుతూనే ఉంటారు. అయితే ఇలాంటివన్నీ వాడేటప్పుడు మనలో చాలామంది కాలక్షేపం కోసం ఎక్కువగా ఇందులోని వీడియోలను చూస్తుంటారు. అలా ఆ వీడియోస్ ని చూసేటప్పుడు మనకు ఏదైనా ఒక వీడియో నచ్చితే దానిని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటాము. కానీ కొన్ని సందర్భాలలో ఆ వీడియోలను ఆ సోషల్ మీడియా ద్వారా డౌన్లోడ్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. అయితే మరి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ? ముఖ్యంగా ఫేస్ బుక్ లోని వీడియోలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ?ఇప్పుడు ఒకసారి చూద్దాం.
మనలో చాలామంది ఎక్కువగా ఉపయోగించేది ఫేస్ బుక్ నే. అయితే ఈ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన వీడియోలను ఆఫ్ లైన్ లో వీక్షించడానికి వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విండోస్ ,మాక్ లో ఫేస్బుక్ వీడియోలను డౌన్లోడ్ చేసే విధానాలు ప్రస్తుతం అనేక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అందులో fbdown.net వెబ్ సైట్ అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపిక లలో ఒకటి. అయితే ఈ వెబ్ సైట్ ను ఉపయోగించి , వీడియోలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
1). ముందుగా మీరు డెస్క్ టాప్ లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్న ఫేస్ బుక్ వీడియో పై రైట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత url ను కాపీ చేయాలి.
2). అలా కాపీ చేసిన లింక్ ను fbdown.net వెబ్ సైట్ లో లింకును పేస్ట్ చేయండి. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ sd లేదా hd నాణ్యతను ఎంచుకోండి.
3). ఆ తర్వాత వీడియో పై రైట్ క్లిక్ చేసి , మీ డెస్క్ టాప్ లో సేవ్ చేసుకోవాలి.
ఆండ్రాయిడ్ లో ఫేస్బుక్ వీడియోలు డౌన్లోడ్ చేసే విధానం :
1). మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నా ఫేస్ బుక్ వీడియోను ఓపెన్ చేయాలి. షేర్ ఎంపిక పై క్లిక్ చేసి ,ఆ పై లింకును కాపీ చేయాలి.
2). ఆ తరువాత fbdown.net వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీకు ఎక్కడైతే అవసరము అక్కడ ఈ లింకును పేస్ట్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఫేస్ బుక్ వీడియోలలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియో యొక్క నాణ్యతను కూడా ఎంచుకుని , ఆ తర్వాత క్రోమ్ లో డౌన్లోడ్ లింక్ ఎంచుకోవాలి. ఇక ఆ తర్వాత ఫైర్ఫాక్స్ లో వీడియోలు సేవ్ చేయవచ్చు.
3). ఇక ఆ తర్వాత ఫేస్ బుక్ వీడియోస్ ఆటోమేటిక్ గా ఫోల్డర్ లో సేవ్ అవుతాయి.