ఒప్పో ఆ ఫోన్ పై భారీ తగ్గింపు.. ఎంతంటే ?

Satvika
ఒప్పో కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వాటికి మంచి టాక్ తో పాటుగా మంచి డిమాండ్ కూడా అందుకున్నాయి.దాంతో కంపెనీ వరుస ఫోన్లను, సరికొత్త టెక్నాలిజీ ఉన్న ఫోన్లను విడుదల చేస్తూ వస్తున్నారు. అంతేకాదు వాటి పై భారీ తగ్గింపును కూడా ప్రకటిస్తున్నారు. గాథలో కూడా చాల ఫోన్లపై డిస్కౌంట్ ను ప్రకటించిన విషయం తెలియసిందే ..
ఇటీవల మార్కెట్ లోకి  వచ్చిన మరో ఫోన్  భారీ తగ్గింపును అందిస్తుంది. ఇక ఆశలు ఆలస్యం లేకుండా ఆ ఫోన్ ఏంటి? ముందు ధర.. ఇప్పటి ధర ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మనదేశంలో ఏ53 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని పై రూ.2,500 వరకు తగ్గింపును ఒప్పో అందించింది. అయితే ఇది కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందు లో 90 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించారు. ఆక్టా-కోర్ ప్రాసెసర్, వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 18W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినపుడు రూ.12,990గా ఉండేది. ఇప్పుడు రూ.2,000 తగ్గింపుతో రూ.10,990కే అందుబాటులో ఉండనుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,490గా నుంచి రూ.12,990కు తగ్గింది. అంటే దీనిపై రూ.2,500 తగ్గింపును అందిచారన్న మాట. ఎలక్ట్రిక్ బ్లాక్, ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్ లో  అనుదుబాటులో ఉంది. చూసారుగా స్మార్ట్ ఫోన్ తక్కువలో కొనాలనుకునేవారికి ఇది సువర్ణ అవకాశం త్వరపడండి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: