షియామి కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందరికీ తెలిసిందే.. ఇటు ఫోన్లు, అటు ఎలెక్ట్రానిక్ వస్తువులతో మార్కెట్ ను తన గుప్పిట్లో పెట్టుకుంది. కొత్త కొత్త ఫోన్లను, ఎలెక్ట్రానిక్ వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది. ఇదే రేంజ్ కొనసాగించేందుకు ప్రయత్నం చేసింది.. ఈ మేరకు తాజాగా తన కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది. ఆ ఫోన్వివరాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
షియామీ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్‌తో ఎంఐ 11ఎక్స్ ప్రోను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. శాంసంగ్ కూడా 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ సెన్సార్‌ను రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ మేరకు వీబోలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియా కూడా చేశారు. ఈ టిప్ స్టర్ పోస్ట్ ప్రకారం.. షియోమీ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌ను రూపొందిస్తుంది. కానీ ఆ స్మార్ట్ ఫోన్ పేరు మాత్రం తెలియయరాలేదు.
ఐస్ యూనివర్స్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ ను శాంసంగ్ రూపొందిస్తుందని కంపెనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇకపోతే ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22లో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌కు సంబంధించిన 3డీ ప్రొడక్ట్ రెండర్స్ కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. కెమెరా మాత్రం అదిరిపోవడం తో ఈ ఫోన్ లాంఛ్ కీ సిద్దంగా ఉన్నాయి. ఇప్పటివరకు కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు ఎంత క్రేజ్ ను అందుకున్నాయి చెప్పనక్కర్లదు.. ఇక ఈ ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి..