బుల్లిపిట్ట : ఉగాది కానుక ₹1 కే స్మార్ట్ టీవీ..!
ఫెస్టివల్ అంటేనే ఏదో ఒక ఆఫర్ తో ముందుంటుంది MI (షియోమి) కంపెనీ. అలాంటిది ఈసారి స్మార్ట్ టీవీ పై ఆఫర్లు విడుదల చేశారు. ఎం ఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు ముగుస్తుంది. ఈ ఫెస్టివల్ లో ఒక్క రూపాయికే పలు ప్రోడక్ట్స్ ఫ్లాష్ సేల్ లో అమ్ముతున్నసంగతి తెలిసిందే. అందులో భాగంగా రూ.15,999 విలువైన స్మార్ట్ టీవీని కేవలం ఒక్క రూపాయికే అమ్మనుంది. ఎమ్. ఐ ఫ్లాష్ సేల్ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1). Mi tv 4A: ఎం ఐ ఫ్యాన్ ఫెస్టివల్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈరోజు నాలుగు గంటలకు చివరి ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది షియోమి ఇండియా. ఈ ఫ్లాష్ సేల్ లో రూ.15,999 విలువైన ఎంఐ టీవీ 4a మోడల్ 32 అంగుళాలు స్మార్ట్ టీవీ ని ఒక రూపాయికే సొంతం చేసుకోవచ్చు.
2).Mi. tv 4A 80 cm : ఈ ఫ్లాష్ ఎల్లో ఎంఐ టీవీ 4a మోడల్ 32 అంగుళాలు హోరైజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ 10 యూనిట్స్ అమ్ముతోంది షియోమి . ఒక్క రూపాయికే స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు.
3).mi బియర్డ్ ట్రిమ్మర్ : రూ. 899 విలువైన mi బియర్డ్ ట్రిమ్మర్ ని కూడా ఒక రూపాయికి అమ్మనుంది షియోమి ఇండియా. మొత్తం యాభై ట్రిమ్మర్ లను ఫ్లాష్ సేల్ లో అందుబాటులో వున్నాయి.
ఇక mi tv 4a హొరైజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ విశేషాలు చూస్తే, ఇది 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ. 1366 x 768 రెజల్యూషన్ ఉంటుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంటుందని కూడా షియోమి ప్రకటించింది. ఈ టీవీ రిఫ్రెష్ రేట్ 60 HZ. అంతేకాకుండా ఇందులో అనేక ఫీచర్లు కూడా అందుబాటులో వున్నాయి. బ్యాచ్ వాల్ యూజర్ ఇంటర్ ఫేస్ తో పని చేస్తుంది. అంతేకాకుండా 2, 10 వాట్స్ స్పీకర్ లు కూడా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి ఆఫర్ను పొందాలి అంటే షియోమి వెబ్సైట్లోకి వెళ్లి సంప్రదించవచ్చు..