బుల్లిపిట్ట: ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ సేల్ అందించబోతోన్న జీ కార్డ్..!

Divya

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే గృహోపకరణాలను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ ను అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఏదో ఒక డిస్కౌంట్ కింద ప్రతి కంపెనీ ఏదో ఒక వస్తువును ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో సంస్థ  జీ కార్డ్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను అభివృద్ధి చేస్తోంది 'APTS'. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ కామెంట్ హోటల్ కంటే తక్కువ రేటుకు వస్తువులను అందించే విధంగా నేరుగా  తయారు సంస్థల నుంచి ఒప్పందం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు ఇచ్చేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వస్తువులను డెలివరీ చేయడానికి లాజిస్టిక్ సంస్థల సహకారంతో సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు జరిగాయి.

జీ కార్డు ద్వారా లభించే వస్తువులలో ముఖ్యం గా కంప్యూటర్లు ,టాబ్లు,మొబైల్ ఫోన్ ల తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను డిస్కౌంట్ ధరలకే అందించే విధంగా ఆంధ్రప్రదేశ్  టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) ప్రయత్నం చేస్తోంది.  అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తరహాలో 'జీ కార్డ్'పేరుతో ఒక పోర్టల్ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగుల ఐడి నెంబర్ ను నమోదు చేసి,  ఈ వస్తువులను కొనుగోలు చేసే విధంగా పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు.

ఈ పోర్టల్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ ఆడిటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే  ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పోర్టల్ ను ప్రారంభిస్తామని ఏ పి టి ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ వెల్లడించారు. దీనివల్ల సుమారుగా 10.36 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారికి ప్రయోజనం లభిస్తుందని అంచనా వేస్తోంది. అంతే కాకుండా ఈ వస్తువులను కొనుగోలు చేస్తే. వీటిని నేరుగా ఇంటికి చేర్చడం కోసం లాజిస్టిక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయితీల కింద అన్ని వస్తువులను కొనుగోలు చేస్తే అవకాశం ఏ పీ టి ఎస్ కల్పించనుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: