అదిరిపోయే ఫీచర్లతో మైక్రో మాక్స్ ఫోన్.. ధర ఎంతంటే?

Satvika
ఇండియా లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ మేరకు ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రో మాక్స్ అదిరిపోయే ఫీచర్లతో ఒక ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ను కలిగి ఉంది. తాజాగా ఇన్ 1 పేరుతో 5జీ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. గతేడాది నవంబర్లో నోట్ 1, ఇన్ 1బీ పేరిట రెండు స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టి మొబైల్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు స్మార్ట్ఫోన్లను తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో అందించడంతో ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

రానున్న రోజుల్లో 5జి మొబైల్స్ రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఇన్ 1 పేరుతో తాజా స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. కాగా, ఈ ఫోన్లో ఆకర్షణీయమైన ఫీచర్లను చేర్చింది. దీని వెనుక భాగంలో X ప్యాటర్న్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ డిజైన్, మీడియా టెక్ హెలియో జి 80 వంటి ఫీచర్ల ను అందించింది.

ఈ స్పెషల్ ఫీచర్స్ విషయానికొస్తే.. బేస్ మోడల్ ధర రూ. 10,499 ఉండగా, టాప్ మోడల్ ధర రూ. 11,999గా ఉంది. ఇవి బ్లూ, పర్పుల్ కలర్ వేరియంట్లలో లభ్యమవుతాయి. మైక్రోమాక్స్ ఇన్ 1 స్మార్ట్ఫోన్లు మార్చి 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మైక్రోమాక్స్ వెబ్‌సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఇక, ప్రారంభపు ఆఫర్ కింద మైక్రోమాక్స్ 4 జీబీ + 64 జీబి మోడల్ రూ. 9,999, 6జీబి  + 128 జీబి మోడల్ రూ.11,499లకు లభిస్తుంది..ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్తో 48 మెగా పిక్సెల్ ప్రాధమిక సెన్సార్, ఫీల్డ్ డీప్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను అందించింది. ముందు భాగంలో, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెంట్రల్ హోల్-పంచ్ కటౌట్‌లో 4.6 మి.మీ పొడవుతో అందిస్తుంది.5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది ప్యాక్ చేయబడి ఉంటుంది.. మొత్తానికి తక్కువ ధరలోనే ఈ ఫోన్ రానుందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: