రియల్ మీ నుంచి సరికొత్త ఫీచర్లతో మరో ఫోన్ లాంఛ్.. ఎప్పుడంటే?

Satvika
రియల్ మి.. ప్రముఖ మొబైల్ కంపెనీలలో ఒకటి.. ఈ కంపెనీ అగ్రగామి సంస్థగా పేరొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ఫోన్లను విడుదల చేసింది.ఇప్పుడు కూడా మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అదే రియల్ మీ 8 సిరీస్. ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్చి 24న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేశారు కంపెనీ సీఈఓ మాధవ్ శేత్. అయితే ఇది ఏ ఫోన్ అనే విషయాన్ని కచ్చితమైన సమాచారాన్ని ఆయన తెలియజేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇది రియల్ మీ 8-సిరీసేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ ఫోన్ 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. ఇప్పుడు మార్చ్ 24 న మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫోన్ పూర్తి వివరాలను హీరో మాధవ్ ఒక వీడియోలో ప్రకటించారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది సాధించండి. రియల్ మీ ఛాలెంజ్ స్వీకరించండి" అని ఆయన అన్నారు. మార్చి 24న ఈ సంస్థ రియల్ మీ 8-సిరీస్ ను ఆవిష్కరిస్తుందని, దీనికి 108 మెగాపిక్సెల్ కెమెరా సామర్థ్యమున్నట్లు ఈ వీడియో చూసి పలువురు అభిప్రాయపడుతున్నారు.


రియల్ మీ 8-సిరీస్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా సెన్సార్ తో పాటు మరికొన్ని స్పెసిఫికేషన్లు కలిగి ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే రియల్ మీ 8 ప్రో 108 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.రియల్ మీ 8 ప్రో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో 65 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో అందుబాటులోకి రానుందని నివేదించింది. ఇది ఆండ్రాయిడ్ 11- ఆధారిత రియల్ మీ యూఐ 2.0తో నడుస్తుందని తెలిపింది... సెల్ఫీ ప్రియులకు మాత్రం ఈ ఫోన్ చక్కగా ఉపయోగ పడుతుందని స్పష్ట మవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: