" బుల్లిపిట్ట " ఆ గేమ్ ఆడితే..గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్ ను రూ.499 కే మీ సొంతం..
మీరు గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్ ధర రూ.2490 నుంచి రూ.4999 మధ్య ఉంది. అందులో మనం సెలెక్ట్ చేసుకునే దానిని బట్టి ధర మారుతుంది. అంత విలువైన స్మార్ట్ స్పీకర్ ను కేవలం 499 రూపాయలకే మనం కొనవచ్చు. అదేంటి అంత ధర ఉన్న స్మార్ట్ స్పీకర్ ను కేవలం ఐదు వందల లోపు రూపాయలకే కొనవచ్చా..? ఎలా అని ఆలోచిస్తున్నారా..? ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒకటే.. అది మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ హోమ్ మినీ గేమ్ ఆడి కూపన్ సంపాదిస్తే చాలు. ఈ ఆఫర్ ను గూగుల్, ఫ్లిప్ కార్ట్ లు సంయుక్తంగా కలిసి అందిస్తున్నారు. ఈ కూపన్ వల్ల కేవలం రూ.499 కే గూగుల్ హోమ్ మినీ స్పీకర్ ను కొనవచ్చు.
ఈ గేమ్ గత నెలే మొదలయింది . ఫిబ్రవరి 25న ముగుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ గేమ్ ఆడి రూ.2,490 కు,విలువైన గూగుల్ కంపెనీ స్మార్ట్ మినీ స్పీకర్ ను 499 రూపాయలకే కొనొచ్చు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత ఓకె గూగుల్ అని టైప్ చేస్తే,గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. ప్లే గూగుల్ హోమ్ మినీ గేమ్ అని అనండి.. గూగుల్ హోమ్ మినీ గేమ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో అందులో ఇవ్వబడ్డ ఇన్స్ట్రక్షన్స్ ను చూడండి.
ఈ గేమ్ లో ఉండే సే వెదర్ అబౌట్ టుమారో , సెట్ యాన్ అలారం , టేక్ సెల్ఫీ, ప్లే యూట్యూబ్ వీడియో , ప్లే న్యూస్ ఇలా పలు టాస్క్ లు వస్తాయి. ఇలా అన్నీ పూర్తి చేసిన తర్వాత గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్ రూ. 499 ధరకే సొంతం చేసుకోవడానికి ఒక కోపం వస్తుంది. ఆ కోపం ను రెడీమ్ చేసుకుంటే, రూ.2,490 విలువగల గూగుల్ హోమ్ మినీ స్పీకర్ ను రూ.499 కే సొంతం చేసుకోవచ్చు. ఇదే విధంగా ప్రతిరోజూ 500 కూపన్స్ ఇస్తోంది గూగుల్. కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి రోజు నైట్ 12 గంటలకు కాంటెస్ట్ మొదలవుతుంది. ప్రతి రోజు 500 మాత్రమే కూపన్ లభిస్తుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గేమ్ ప్రతిరోజు అయినా ఆడవచ్చు. అలాగే అన్ని టాస్క్ లు ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి. అయితే మరెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి.