"బుల్లిపిట్ట "రైతులకు ఒక శుభవార్త ? ఇకపై డీజిల్ అవసరం లేని ట్రాక్టర్ రాబోతోంది..

Divya
ట్రాక్టర్  మిషన్ అని మనందరికీ తెలిసినదే.డీజీల్ లేనిదే  ముందుకు సాగదు . ప్రస్తుత కాలంలో చాలా మంది ఆధునిక వ్యవసాయ మీద ఆధారపడటం వల్ల  ప్రతి ఒక్కరూ ట్రాక్టర్ ను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. ఇక మరీ పల్లె ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్ వినియోగం  ఎక్కువైంది.  అంతేకాకుండా ఇది  ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని,కేంద్ర ప్రభుత్వం ఒక ట్రాక్టర్ ను ఆవిష్కరించారు. వ్యవసాయం చేసే వారికి ట్రాక్టర్ అవసరం వుంటుంది. అంతేకాకుండా వ్యవసాయం సంబంధించి ఏ చిన్న పని చేయాలన్నా, ట్రాక్టర్ తోనే చేయాలి. పండించిన పంటను  మార్కెట్టుకు వేసుకొని పోవాలన్నా ట్రాక్టర్ అవసరము..

ఇప్పుడు సరికొత్త ట్రాక్టర్ వచ్చేసింది. డీజిల్ తో పని లేకుండా, cng తో నడుస్తుంది. దేశంలో తొలిసారిగా cng ట్రాక్టర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  కేంద్రమంత్రి లైన  నరేంద్ర సింగ్ తోమర్,  ధర్మేంద్ర ప్రధాన్, పురుషోత్తం రూపాల, వీకే సింగ్ కూడా పాల్గొన్నారు. రామ టెక్నో సొల్యూషన్స్, టొమాసెటో అచిల్లీ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ ట్రాక్టర్ ను  రూపొందించాయి. cng ఇంధనం ద్వారా రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగనుంది.
 CNGతో నడిచే ట్రాక్టర్ ద్వారా ప్రతి ఏటా రైతులకు  దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయం మిగులుతుందని  రవాణాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా రైతులకు  ఎన్నో లాభాలు ఉన్నాయి.
 CNG ట్రాక్టర్ కు ప్రధానంగా మూడు లాభాలున్నాయి . దీనికి  డీజిల్ ఇంజన్ తో పోలిస్తే cng సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది .  దీనికి  దాదాపు 70 శాతం వరకు పొగ తక్కువ విడుదలచేస్తుంది. అంతేకాకుండా రైతులకు ట్రాక్టర్ పై పెట్టె ఖర్చు లో సగభాగం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ధర 80 -84 వరకు ఉంది.  అదే కేజీ cng ధర రూ.42 మాత్రమే. అంతేకాకుండా cng లో కార్బన్ ఇతర కాలుష్య కారకాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. డీజిల్ ఇంజన్ తో పోలిస్తే, సీఎన్జీ ఇంజన్ ఎక్కువ మన్నిక అయినది. చాలా కాలం వరకు ఇంజన్ చెడిపోకుండా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే. వాతావరణ కాలుష్యం నేపద్యంలో చాలా కంపెనీలు cng ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పై దృష్టి పెట్టాయి. రాబోయే రోజుల్లో అనేక కంపెనీలు ఇలాంటి పర్యావరణహిత వాహనాలను ఉత్పత్తి చేయబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: