స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే జరా ఆగండి!

Divya
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ నిత్యావసరంగా మారింది.  ఒక పూట అన్నం లేకపోయినా ఉండగలరేమో కాని ఒక సెకండ్ మొబైల్ కనిపించకపోతే మాత్రం అల్లాడిపోతున్నారు ప్రస్తుతం యువత. అంతలా స్మార్ట్ఫోన్లకు బానిస అయ్యారు. ఈ అవకాశాన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కాసులుగా మార్చుకుంటున్నాయి.యువతను ఆకర్శించేందుకు సరి కొత్త ఫీచర్స్ తో, కొత్త టెక్నాలజీతో మన ముందుకు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ల కంపెనీలు అభివృద్ధి చెందుతూ యువతకు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా చిన్న పిల్లలు సైతం స్మార్ట్ఫోన్లకు బానిసలు అవ్వడానికి కారణం వాటిలో వస్తున్న సోషల్ మీడియాతోపాటు వింతైన టెక్నాలజీ.

యువత ఇలాంటి స్మార్ట్ఫోన్లను కొనడానికి ఎంత డబ్బు అయినా పెట్టడానికి వెనకాడటం లేదు. ఇక కంపెనీలు ఇదే తడవుగా వేలకు వేలు స్వాహా చేస్తున్నాయి. ఇంత స్మార్ట్ టెక్నాలజీతో మన ముందుకు వస్తున్న స్మార్ట్ఫోన్లు ఇకపై చార్జీలను ఇవ్వబోమని నిర్ణయించుకున్నాయి. అందుకు కారణం పర్యావరణమే అని సూచిస్తున్నాయి,సాధారణంగా మొబైల్ ఫోన్ కొంటే దానితోపాటు చార్జర్, హెడ్ సెట్ ఉచితంగా ఇచ్చేవి. గత కొద్ది కాలం నుండి హెడ్ సెట్ ను ఇవ్వడం పూర్తిగా మానేసాయి అన్ని  కంపెనీలు.

ఇప్పుడు మరోసారి ఛార్జర్లు కూడా ఇవ్వబోమని ప్రకటిస్తున్నాయి. అయితే ఫోన్కు చార్జర్ ఇవ్వకపోతే ఏ విధంగా చార్జ్  చేసుకోవాలని అందరూ ఆలోచనలో పడ్డారు.ఇదిలా ఉండగా గత సంవత్సరం ఆపిల్ కంపెనీ ఐఫోన్ 12 మొబైల్ కు చార్జర్ ఇవ్వడం మానేసిందని  మనందరికీ తెలుసు.ఇప్పుడు అన్ని కంపెనీలు  కలిసి మొబైల్ చార్జర్ ను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. ఇకపై ఎలాంటి స్మార్ట్ ఫోన్  తీసుకోవాలనుకున్నప్పటికీ మనకు కేవలం బాక్సులో  మొబైల్ మాత్రమే దొరుకుతుంది.

మొబైల్ చార్జర్ పక్కన విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్తో చార్జర్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అడిగినప్పుడు కంపెనీలు పర్యావరణ కారణమని చెప్పడం,ఇంతవరకు దీనికి సరైన సమాధానం ఎవ్వరికీ దొరకలేదు. ఒకవేళ ఏదైనా అడిగినప్పుడు కంపెనీలు మాత్రం పర్యావరణ సంరక్షణ కోసమే మొబైల్ చార్జర్ ఇవ్వడంలేదని చెబుతున్నాయి
ఇకపై మీరు ఎలాంటి మొబైల్ కొన్నప్పటికీ చార్జర్ విడిగా కొనక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: