బుల్లిపిట్ట: రూ.7 వేల లోపే మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ.... ఫీచర్స్ ఇవే....!

Suma Kallamadi
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా...? అయితే మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ గురించి చూడాలి. వివరాల్లోకి వెళితే... ఈ ఇన్ 1బీ స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ మన దేశంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాబట్టి ప్రీ-బుకింగ్స్ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల తరవాత నుండి చేసుకోవచ్చు. మైక్రోమ్యాక్స్ నోట్ 1, మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో నవంబర్ 3వ తేదీన లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ధర, ఫీచర్స్ ఇవే..

ఈ మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీలో రెండు స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం పై మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ పనిచేయనుంది. ఇందులో ఎటువంటి బ్లోట్‌వేర్‌ని మైక్రోమ్యాక్స్ అందించలేదు. పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది. దీని ధర విషయం లోకి వస్తే... వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది.  ఇక రంగుల్లోకి వెళితే... బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే...  2 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్‌ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకోవచ్చు. కెమెరా వివరాల్లోకి వెళితే... ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు.




 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: