బుల్లిపిట్ట: వాట్సాప్‌పేకు అనుమతి ఇచ్చిన ఎన్‌పీసీఐ...!

Suma Kallamadi
ఎప్పుడో మన దేశం లో  రావాల్సిన వాట్సాప్‌ పేకు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగి పోయాయి. అయితే ఇక నుండి వాట్సాప్‌ యూజర్స్ వాట్సాప్ ‌పే ని ఉపయోగించుకోవచ్చు. తాజాగా మన దేశం లో అధికారికంగా లాంచ్ అవ్వడానికి జాతీయ చెల్లింపుల కార్పొరేషన్  (ఎన్‌పీసీఐ) అనుమతిని అందించింది. కానీ దశల వారీగా దీనికి అనుమతులు ఇచ్చినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే ... మొదట గరిష్టంగా 2 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్ల తో ప్రారంభించడానికి అనుమతులు లభించాయి.  పోల్చి చూడాలంటే ఫోన్‌ పే ఈ మధ్యే 25 కోట్ల యూజర్ల మార్కును దాటినట్లు ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఒక యాప్ ద్వారా 30 శాతం కంటే ఎక్కువ జరగకూడదనే నియమం త్వరలో అమల్లోకి రానుందని ఎన్‌పీసీఐ వెల్లడించింది. వాట్సాప్ పే మన దేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. వాట్సాప్‌ ని ఇప్పటికే మన దేశం లో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నాయి. ఇది ఆ కంపెనీకి అదనపు లాభం అవుతుందని ఎన్నో కంపెనీలు భయ పడ్డాయి. వినియోగదారుల విషయం లో పరిమితి విధించడం తో దీన్ని ఎంతమంది ఉపయోగిస్తారో తెలియ రాలేదు. కానీ ఇప్పుడు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో దీనికి సంబంధించిన నిర్వహణను వాట్సాప్ త్వరలోనే ప్రారంభించనుంది.

ఇది ఇలా ఉండగా వాట్సాప్ ఇటీవలే డిజప్పియరింగ్ మెసేజెస్ అనే కొత్త ఫీచర్‌ను కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసినదే. దీని సాయం తో వాట్సాప్ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే విధంగా సెట్ చేయవచ్చు. ఇలా ఆటోమేటిక్‌గా మెసేజెస్ డిలీట్ అవుతాయి. వాట్సాప్ ద్వారా రోజుకు 10 వేల కోట్ల మెసేజ్‌లు డెలివర్ అవుతున్నట్లు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: