యాడ్ లు లేకుండా యుట్యూబ్ ను అందిస్తున్న నెట్ వర్క్ ఇదే..

Satvika
మొబైల్ ప్రియులు ఫోన్ లో ప్రపంచాన్ని చూస్తుంటారు. స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు సోషల్ మీడియాలో అతుక్కు పోతారు..అందుకే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా కొత్త రకం ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఫోన్ ఉంది బాగానే ఉంది కానీ అందులో వాడుకోవడానికి నెట్ ఉంటే వాళ్ళు ఇంక రచ్చ రచ్చ చేస్తారని చేస్తారు.. అయితే మంచి నెట్ వర్క్ ఉంటే  ఇంకా వారిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు .. అలాంటి మొబైల్ ప్రియులకు దిగ్గజ టెలికాం నెట్ వర్క్ అయిన ఎయిర్ టెల్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నారు.



అవెంటంటే.. ఎయిర్ టెల్ ప్రస్తుతం ఒక ప్రమోషనల్ ఆఫర్ అందిస్తోంది. దీని కింద యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్‌ను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్ ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అయితే ఇది ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, యూట్యూబ్ రెడ్, గూగుల్ ప్లే మ్యూజిక్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోని వారికి దీన్ని ఎయిర్ టెల్ ఉచితంగా అందిస్తోంది.. మాములుగా యుట్యూబ్ ప్రైమ్ కస్టమర్లకు ఈ ఆఫర్ బాగా ఉపయోగ పడుతుంది.. బ్యాక్ గ్రౌండ్, యుట్యూబ్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ వంటివి ఈ కష్ట మర్లకు అందుబాటులో ఉంచారు.




వచ్చే ఏడాది ఏప్రిల్  22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్‌లో పేర్కొంది. దీన్ని కొద్దిరోజుల క్రితం ఎయిర్ టెల్ సైలెంట్‌గా లాంచ్ అయింది. ఈ ఆఫర్ విషయానికొస్తే.. ఇంతవరకు యూట్యూబ్ ప్రీమియం ఉపయోగించని వారికి ఈ ఆఫర్ లభించనుంది. అంటే ఒకవేళ మీకు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉంటే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుందని తెలుస్తుంది.ఎయిర్ టెల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్‌ను పోస్ట్ పెయిడ్, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు ఉచితంగా అందించడం ప్రారంభించింది. అయితే ఈ ఆఫర్ రూ.499కు పైబడిన వాళ్లకు 999 కష్టమర్లకు ఈ సదుపాయాలు చక్కగా ఉపయోగడుతుంది.. ఇప్పుడు కస్టమర్లు ఈ ఆఫర్ కోసం సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: