కొత్త లాప్టాప్, కంప్యూటర్ కొనేటప్పుడు ఈ విషయాలు గమనించి కొనండి..!

Kothuru Ram Kumar
ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ మొదలైంది. అంతే కాకుండా అనేక కంపెనీలు వారి ఉద్యోగస్తులకు సంబంధించి ఇంటి దగ్గర ఉండి పని చేయడం కారణంగా అనేక మంది కొత్త కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీలు అనేక ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్ తో కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి ఎవరైనా కొత్త సిస్టం లేదా లాప్టాప్ లాంటివి కొనాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలాంటి వాటిని సెలక్ట్ చేసుకోవాలో తెలుసుకుంటే మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. వాటి వివరాలు ఒకసారి చూద్దామా...


ముందుగా మీరు ఎలాంటి పనుల కోసం సిస్టంను ఉపయోగించాలని ఒక ఐడియా ఉంటే అందుకు సంబంధించి లాప్టాప్ లేదా కంప్యూటర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే బేసిక్ లెవెల్ కోసమే కంప్యూటర్ కొనే విధంగా అయితే కేవలం ఇంటెల్ i3 సిస్టం ను తీసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం 25 వేల నుంచి 35 వేల మధ్యలో బడ్జెట్ సరిపోతుంది. అలా కాదు గ్రాఫిక్స్ సరిపోయే విధంగా, గేమ్స్ లాంటి వాటి కోసం ఉపయోగించాలి అంటే మీరు కచ్చితంగా 50 వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వీరి కోసం ఇంటెల్ i7 లాంటి శక్తివంతమైన ప్రాసెసర్ లను తీసుకోవాల్సి ఉంటుంది.


వీటితో పాటు అన్ని రకాల కేబుల్స్ తీసుకోబోయే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయో లేవో చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లాప్టాప్ కొనే వారు మీరు ఎక్కడికైనా లాప్టాప్ మోసుకొని తిరిగే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే కచ్చితంగా లైట్ వెయిట్ లాప్టాప్ లను పెంచుకోవడం ఎంతగానో మేలు. లేదంటే ఆఫీస్ లేదా ఇంట్లోనే ఒకేచోట కూర్చొని పని చేయాలని అనుకునేవారు కాస్త రెండు కేజీల నుంచి మూడు కేజీల బరువు ఉంటే సరిపోతుంది. అలాగే బయటికి తిరగాల్సిన వారు 13 లేదా 14 అంగుళాలు ఉన్న ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకుంటే మోయడానికి చాలా సులువుగా ఉంటుంది. లేకపోతే ఒకే చోట కూర్చొని పని చేసే వారికి 15 అంగుళాల స్క్రీన్ ఉండేవిధంగా ల్యాప్టాప్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అధిక శాతం బడ్జెట్ ల్యాప్టాప్ లు 720 p రిజల్యూషన్ మాత్రమే కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వీటినన్నింటినీ సరి చూసుకుని మీకు ఏది కావాలో అందుకు సంబంధించి మోడల్ ను సెలెక్ట్ చేసుకుంటే మీరు తక్కువ ఖర్చు లోనే ల్యాప్ టాప్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: