భారత్ లో త్వరలో విడుదల కాబోతున్న గూగుల్ పిక్సెల్ 4ఏ ...!

Suma Kallamadi
వ్యక్తిగత కంపెనీ గూగుల్ సంస్థ తాజాగా తన కొత్త స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 4ఏ భారతదేశంలో అక్టోబర్ 17 న లాంటి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక ఇందుకు సంబంధించి సేల్స్ ను ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోను గూగుల్ అమ్మనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను గూగుల్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఇది వరకే ఆగస్టు నెలలో ఈ ఫోన్ అమెరికాలో లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్ సంబంధించి ధర ఇంకా తెలియడం లేదు. అయితే అమెరికా ధరల ప్రకారం చూస్తే అక్కడ 349 డాలర్లుగా ఈ ఫోన్ ధరను నిర్ణయించారు. ఇది మన భారత కరెన్సీలో రూ. 25,700.


ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే ఆగస్టు నెలలో అమెరికా లో విడుదల అయిన సమయం లో 6 జిబి ర్యామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ కలిగిన మోడల్ మాత్రమే అక్కడ విడుదల చేసింది. అందులో కూడా కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే వినియోగదారులకు ఇచ్చింది. అయితే గూగుల్ పిక్సెల్ 4A కంటే ముందుగా గూగుల్ పిక్సెల్ 3A ధరను మన మనదేశంలో ఓ సారి చూస్తే రూ. 39,999 గా నిర్ణయించడం జరిగింది. ఇక కొత్తగా విడుదల కాబోయే గూగుల్ పిక్చర్ 4a ఫోన్ కూడా అంతే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం 11 పై పని చేస్తుంది.


ఇక ఈ ఫోన్ లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 730g ప్రాసెసర్ ని ఉపయోగించబోతున్నారు. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ చూస్తే 581 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్, ఓఎల్ఈడి డిస్ప్లే ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ వెనుక వైపు 12 మెగాపిక్సల్ కెమెరా ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనితో టాప్ క్లాస్ ఫోటోగ్రఫీ ఫీచర్లను గూగుల్ అందించబడుతుంది. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సల్ కెమెరాని అందించబడుతుంది. ఇక వీటితో పాటు గూగుల్ పిక్సెల్ మొబైల్ లో 4g వోల్ట్, బ్లూటూత్ వి 5.05, టైప్ -c పిన్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్స్ లాంటి అనేక ఫీచర్లను అందించబోతున్నారు. ఇక ఇందులో బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే కేవలం 3140 mah గా మాత్రమే ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను గూగుల్ పిక్చర్ సపోర్ట్ చేయగలదు. ఇది ఈ ఫోన్లో రెండు మైక్రోఫోన్లు అలాగే స్టీరియో స్పీకర్లు లాంటి అనేక ఫీచర్లు సపోర్ట్ చేయనున్నాయి. ఇక ఈ ఫోన్ బరువు విషయానికొస్తే కేవలం 143 గ్రాములు మాత్రమే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: