వాట్సాప్‌లో ఈ ఆరు టిప్స్ పాటిస్తే చాలు.. వేధింపులకు దూరం...!
ఇక గుర్తు తెలియని వారు కాంటాక్ట్ నంబర్ సంపాదించుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ఈ వేధింపులను నిషేధించేందకు నిపుణులు ఈ ట్రిక్స్ వాడండని పేర్కొంటున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దామా. వాట్సాప్‌లో మీకు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను అస్సలు లిఫ్ట్ చేయకండని తెలుపుతున్నారు. ముందు వాటిని డిస్‌కనెక్ట్ చేసి కాల్ చేసిన వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తో కాదో చూసుకోండి. ఒకవేళ తెలియని వ్యక్తి అయితే ఆ నంబర్‌ను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టండని నిపుణులు తెలిపారు.
ఒకవేళ ఆ కాల్ లిఫ్ట్ చేసి, చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని మీరు అనుకుంటే ముందుగా మీ సెల్ఫీ కెమెరాకు వేలు అడ్డం పెట్టండి. అప్పుడు మీరు అవతలి వ్యక్తి కెమెరాలో కనిపించరు. ఒకవేళ అవతలి వ్యక్తి మీకు తెలిసిన వారు అయితే మీరు మామూలుగానే మాట్లాడవచ్చు. ఒకవేళ మీకు +91తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాకుండా వేరే నంబర్ల నుంచి కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే కొంతమంది మోసగాళ్లు తమ నంబర్ ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వేరే నంబర్లతో కాల్ చేసి వేధింపులకు పాల్పడుతారని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అటువంటి నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయవద్దని నిపుణులు తెలిపారు.
ఇక వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ పిక్చర్‌ను కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు మాత్రమే చూసేలా పెట్టుకుంటే మంచిదని వారు అంటున్నారు. దాన్ని పబ్లిక్‌గా అందరికీ కనిపించేలా పెట్టకండి. సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాట్సాప్ సెట్టింగ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మన ఫోన్‌లో ఉన్న ప్రతి కాంటాక్ట్ మనకు కావాల్సిన వారే చూడాలని రూల్ లేదు. కాబట్టి మీరు స్టేటస్ పెట్టేటప్పుడు మీ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు మాత్రమే కనిపించేలా పెట్టుకోవడం మంచిది. సాధారణంగా మనం గ్రూపులకు సంబంధించిన సెట్టింగ్స్ మార్చుకోకపోతే ఎవరైనా మనల్ని వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూపుల్లో మిమ్నల్ని ఎవరూ యాడ్ చేయకుండా ఉండేలా మీరు సెట్టింగ్స్ మార్చుకోవడం మంచిదని నిపుణులు తెలిపారు.