బుల్లిపిట్ట: ఆకర్షిస్తున్న మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ ఫీచర్లు...!
మోటోరోలా స్మార్ట్ ఫోన్ లో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధరను రూ.16,999 గా ఉండడం జరిగింది. కానీ తర్వాత ధర రూ.500 కి పెంచారు. పెంచిన ధరతో కలిపి ఫోన్ ధర రూ.17,499 గా ఉంది. ఈ ఫోన్ లో రెండు రంగులు ఉన్నాయి. ట్విలైట్ బ్లూ, మూన్ లైట్ వైట్. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ని దీనిలో అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ పనిచేస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ + గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బరువు వచ్చేసి 210 గ్రాములు. ఈ ఫోన్ లో వెనక నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం వచ్చేసి 64 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. అలానే సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను కంపెనీ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు.