పబ్ జి బ్యాన్ అవుతుందని చింతిస్తున్నారా..? ఐతే ఇవి ట్రై చేయండి..!

Suma Kallamadi

భారతదేశం, చైనా దేశాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యం తర్వాత, భారతదేశ ప్రజల వ్యక్తిగత వ్యవహారాల ఈ నేపథ్యంలో చైనా దేశానికి సంబంధించిన మొత్తం 59 యాప్స్ ను భారతదేశ ప్రభుత్వం బ్యాండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు తాజాగా మరో 47 యాప్ లను బ్యాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియలేదు.


అయితే తాజాగా నిషేదించపోతున్న 47 చైనా యాప్స్ లను బ్యాన్ చేస్తున్న నేపథ్యంలో, ఈ లిస్టులో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ గేమ్ అయిన పబ్ జి కూడా ఉందని అనేక మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త పబ్ జి లవర్స్ ని కాస్త కలవరపెడుతోంది. రోజుకి గంటల కొద్దీ ఆ యాప్ లో సమయాన్ని గడిపే వారికి ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. దీంతో కొంత మంది ఆందోళన కూడా చెందుతున్నారు.

ఒకవేళ పబ్ జి బ్యాన్ చేసిన అలాంటి గేమ్స్ గూగుల్ ప్లేస్టోర్ లో చాలానే దొరుకుతాయి. ఇందుకు సంబంధించి కొన్ని గేమింగ్ యాప్స్ చూస్తే... పబ్ జి తర్వాత భారతదేశంలో బాగా పేరుగాంచిన గేమింగ్ ఫోర్ట్ నైట్. నిజానికి ఈ రెండు ఒకేలా కనిపిస్తాయి కూడా. కాబట్టి  పబ్ జి లవర్స్ కి ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు. ఇకపోతే ఆ తర్వాత బ్యాటిల్ ల్యాండ్స్, కాల్ ఆఫ్ డ్యూటీ, గరెనా ఫ్రీ ఫైర్ గేములు మనకు పబ్ జి కి ప్రత్యామ్నాయంగా ఆడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: