గుడ్ న్యూస్: ధర తగ్గిన గెలాక్సీ నోట్ 10 లైట్ ఫోన్ ..!
దక్షిణ కొరియాకు సంబంధించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ లైటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించారు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రారంభ ధరపై నాలుగువేల రూపాయల శాశ్వత తగ్గింపుతో అందుబాటులోకి వచిందన్నారు. అయితే దీనికి అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తోందని తెలిపారు. ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని ముంబైలోని మహేష్ టెలికాంకు చెందిన మనీష్ ఖాత్రి సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని అందజేశారు.
ఇక మొబైల్ ఫోన్‌లపై 18 శాతం జీఎస్టీ రేట్ల పెంపుతో దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ నోట్ 10లైట్ ధరలను పెంచిన విషయం విదితమే. భారతీయ మార్కెటో 4 వేల రూపాయల ధర తగ్గించడంతో పాటు, అదనపు ఆఫర్లను అందించడం విశేషం. సిటీబ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా గెలాక్సీ నోట్ 10 లైట్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 5000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చునన్నారు. మిగిలిన ఆన్‌లైన్ చెల్లింపులపై 2000 రూపాయల క్యాష్ బ్యాక్ అదించనున్నది.
కొనుగోలుదారులు 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్, 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కూడా పొందవచ్చునన్నారు. ఈ ఆఫర్లు జూన్ 30, 2020వరకు మాత్రమే చెల్లుతాయన్నారు. ఈ మోడల్స్ ధరలు ఇప్పటివరకు వరుసగా 41,999 రూపాయలు, 43,999 రూపాయలుగా ఉన్నాయన్నారు. జనవరిలో లాంచ్ చేసినపుడు గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రారంభ ధర 38999 రూపాయలు. ఆ తరువాత జీఎస్టీ కారణంగా ఏప్రిల్ లో 1000 రూపాయలు ధర పెంచిందన్నారు.
శామ్సంగ్ సంస్థ గెలాక్సీ నోట్ 10 లైట్ ఫోన్‌ను రెండు వేరియంట్లలో ఇండియాలో విడుదల చేసింది. గెలాక్సీ నోట్ 10 లైట్ యొక్క 6GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ గల బేస్ మోడల్ రూ.38,999 ధర వద్ద మరియు 8GB + 128GB మోడల్ రూ.40,999 ధర వద్ద లభిస్తుందన్నారు.